https://oktelugu.com/

CDS Helicopter Crash: మానవ తప్పిదంతోనే సీడీఎస్‌ హెలిక్యాప్టర్‌ క్రాష్‌.. ఆ రోజు ఏం జరిగిందంటే..!

నేషనల్‌ చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) తొలి చీఫ్‌గా మాజీ సైనికాధికారి నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌ క్రాష్‌ అయింది. ఈ ఘటనలో ఆయన దుర్మరణం చెందాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 20, 2024 / 11:39 AM IST

    CDS Helicopter Crash

    Follow us on

    CDS Helicopter Crash: త్రివిధ దళాలను ఒకే వేదిక కిందకు తెచ్చేందుకే కేంద్రం 2021లో నేషనల్‌ చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) ఏర్పాటు చేసింది. దీనికి మాజీ సైనికాధికారి బిపిన్‌ రావత్‌ను చీఫ్‌గా నియమించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ను సీడీఎస్‌ మానిటరింగ్‌ చేసేలా బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రావత్‌ బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే 2021, డిసెంబర్‌ 8న ఆయన ప్రయాణిస్తున్న ఎంఐ–17 హెలిక్యాప్టర్‌ క్రాష్‌ అయింది. ఈ ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందాడు. మూడేళ్ల తర్వాత రావత్‌ హెలిక్యాప్టర్‌ ప్రమాదానికి కారణాలను ఇండయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించింది. ఈమేరకు రక్షణ శాఖ స్టాండింగ్‌ కమిటీ నివేదికను లోక్‌సభ ముందు ఉంచింది.

    13వ డిఫెన్స్‌ నివేదిక..
    2017–22 మధ్య 13వ డిఫెన్స్‌ పీరియడ్‌ ప్లాన్‌ పేరిట రక్షన శాఖ స్టాండింగ్‌ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఇందులో 2017 నుంచి 2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించిన 34 ప్రమాదాల వివరాలు వెల్లడించింది. ఇందులో 2021లో జరిగిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ హెలిక్యాప్టర్‌ ప్రమాదం కూడా ఉంది. ఆయన హెలిక్యాప్టర్‌ తమిళనాడులోని కున్నూర్‌లో క్రాష్‌ అయినట్లు వెల్లడించింది. ఈ 6పమాదంలో ఆయనతోపాటు ఆయన భార్య మధులిక, మరో 11 మంది మరణించారు.

    మానవ తప్పిదంతోనే..
    బిపిన్‌ రావత్‌ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే అని స్టాండింగ్‌ కమిటీ తేల్చింది. 2021, డిసెంబర్‌ 8న తహిళానడులోని సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయల్దేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలిక్యాప్టర్‌ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ఉదయం రావత్‌ దంపతులు, ఆర్మీ అధికారులత కలిసి తమిళనాడు నుంచి బయల్దేరారు.

    మార్గం మధ్యలో ప్రమాదం..
    అయితే మార్గం మధ్యలో హెలిక్యాప్టర్‌ లోయ ప్రాంతంలోకి వెళ్లింది. వాతావరణం హఠాత్తుగా మారిపోయింది. దీంతో అయోమయంలో పడిన పైలట్‌ హెలిక్యాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. దీనిపై విచారణ కోసం నియమించిన కమిటీ.. హెలిక్యాప్టర్‌ పైలట్‌ డేటాతోపాటు, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డులను విశ్లేషించింది. తర్వాత ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే అని తేల్చింది.