Rohith Sharma : బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 46 పరుగులకే కుప్ప కూలింది. న్యూజిలాండ్ జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలు కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. న్యూజిలాండ్ బౌలర్లు బెంగళూరు మైదానంపై అద్భుతమైన ప్రదర్శన కొనసాగించారని పేర్కొన్నాడు.. తొలి ఇన్నింగ్స్ లో తమ జట్టుకు చెందిన బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నాడు. కేవలం 50 పరుగుల లోపే చాప చుట్టేస్తామని విషయాన్ని తాము ఊహించలేదని రోహిత్ వివరించాడు. ” మొదటి ఇన్నింగ్స్ దారుణంగా సాగింది. న్యూజిలాండ్ బౌలర్లు మాపై పై చేయి సాధించారు. స్వదేశంలో మాకు చుక్కలు చూపించారు. రెండవ ఇన్నింగ్స్ లో మేము బ్యాట్ ద్వారా మెరుగైన ప్రదర్శన చేశాం. తొలి ఇన్నింగ్స్ గుణపాఠం నుంచి పాఠం నేర్చుకున్నాం. 350 పరుగుల తేడాలో మేమున్నాం. దాని గురించి ఆలోచించినప్పుడు అతిగా ఉంటుంది. ఈ క్రమంలోనే రెండవ ఇన్నింగ్స్ లో మా బ్యాటర్లు కసిగా ఆడారు. బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నారు. మా ఆటగాళ్లు కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే దాని ద్వారా మేము సంచలనం సృష్టిస్తామని అనుకున్నాం. అయితే తొలి ఇన్నింగ్స్ లో మేము విఫలమైన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. అయితే ఆ తర్వాత మేము సాగించిన పోరాటం గొప్పగా ఉంది. ఆ విషయంలో మేము గర్విస్తున్నాం. సర్ఫరాజ్, పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వారు ఆడిన ఆట మాకు ఉత్సాహంగా అనిపించింది. వాళ్లు మైదానంలో సంచలన బ్యాటింగ్ చేశారు. పంత్ తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రిస్కీ షాట్స్ ఆడాడు. అతడి ఆటలో అద్భుతమైన పరిణతి ఉంది.. కొన్ని బంతులను అతను డిఫెండ్ చేశాడు. మరికొన్ని బంతులను వదిలేశాడని” రోహిత్ పేర్కొన్నాడు.
ఆ తప్పిదం మా ఓటమికి కారణమైంది
“పంత్ కంటే ముందు గొప్పగా చెప్పాల్సింది సర్ఫరాజ్ ఇన్నింగ్స్ గురించి. అతడు గొప్ప పరిణతి ప్రదర్శించాడు. నాలుగో టెస్ట్ మాత్రమే ఆడుతున్నప్పటికీ.. ఎంతో అపారమైన అనుభవం ఉన్న ఆటగాడిగా పరుగులు సాధించాడు. అతడు ఆడిన షాట్స్ లో క్లారిటీ కనిపించింది.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ.. మేము అంత త్వరగా పర్యాటక జట్టుకు లొంగిపోలేదు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్వదేశంలో సొంత మైదానంపై అనేక సవాళ్లు విసిరారు. మొదటి ఇన్నింగ్స్ లో వారి సవాళ్లకు మేము తలవంచాల్సి వచ్చింది. వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవుతూనే ఉంటాయి. మాలో ఉన్న పాజిటివిటీని మరింతగా పెంచుకుంటాం. నెగిటివ్ అంశాలను దూరం పెడతాం. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితులు కొత్త కావు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్ లో మేము ఓడిపోయాం. ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టులలో విజయం సాధించాం. అదే సీన్ న్యూజిలాండ్ సిరీస్ లోనూ కొనసాగిస్తాం. మా జట్టులో ఎవరిపై ఇలాంటి బాధ్యత ఉందనేది మాకు తెలుసు. తదుపరి మ్యాచ్ లలో మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నాలు చేస్తామని” రోహిత్ వ్యాఖ్యానించాడు. రోహిత్ వ్యాఖ్యల నేపథ్యంలో తదుపరి మ్యాచ్ లకు టీమిండియాలో భారీగానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rohit sharma sensational comments after defeat against new zealand
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com