Rohit Sharma: ఐసీసీ ట్రోఫీలలో (వన్డే, టి20, ఛాంపియన్స్ ట్రోఫీ) భారత్ ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. 2023 లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్తిలో చేతిలో ఓడిపోయింది. మొత్తం 24 మ్యాచ్లకు గానూ 23 మ్యాచ్లో గెలిచింది. లిమిటెడ్ ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న కెప్టెన్ గా రోహిత్ శర్మ (90%), ఆ తర్వాత పాంటింగ్ (80%), గంగూలీ (80%) ఉన్నారు. కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని వంటి వారు భారత జట్టుకు కెప్టెన్లు గా వ్యవహరించినప్పటికీ.. ఈ స్థాయిలో ఘనతను వారు అందుకోలేక పోయారు. గంగూలీ ఆధ్వర్యంలో 2002లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ధోని ఆధ్వర్యంలో 2007 టి20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది..
ఫైనల్ మ్యాచ్ లో..
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. ఏకంగా 76 పరుగులు చేసి వారెవ్వా అనిపించాడు. రోహిత్ – గిల్ కలిసి శతక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ టీమ్ ఇండియా విజయం అనుకున్నంత ఈజీ కాలేదు. గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ ఇలా కీలక వికెట్లను టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ – అక్షర్ పటేల్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయినప్పటికీ.. మిగతా లాంచనాన్ని కేఎల్ రాహుల్ భుజాల మీదకు వేసుకొని పూర్తి చేశాడు.. సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. సహనంతో బ్యాటింగ్ చేసి.. ఆకట్టుకున్నాడు. అందువల్లే టీమ్ ఇండియా విజయతీరాలకు చేరింది. ఇలా ఎవరి బాధ్యత వారు సమర్థవంతంగా నిర్వహించడం వల్లే టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది.
దుబాయ్ మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరించింది. బంతి మెలికలు తిరుగుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. అయితే రోహిత్ మాత్రం ఈ మైదానంపై దూకుడు కొనసాగించడం విశేషం. టి20 మాదిరిగా బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు వేగంగా పరుగులు చేయడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఒక ఎండ్ లో గిల్ నిదానంగా ఆడుతున్నప్పటికీ.. రోహిత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ సత్తా చాటాడు. అందువల్లే తొలి 10 ఓవర్లలో టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకు వెళ్లింది.