Rohit Sharma: రిటైర్మెంట్ పై బహుశా ఇటీవల కాలంలో ఒక క్రికెటర్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది అంటే అది కేవలం రోహిత్ శర్మ గురించి మాత్రమే కావచ్చు. ఆస్ట్రేలియా సిరీస్.. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్.. ఆ తర్వాత రంజీలలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు ఎక్కువైపోయాయి.
ఇటీవల ఇంగ్లాండు గట్టిగా జరిగిన వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో రోహిత్ విఫలమయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్లో సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. దీంతో రిటైర్మెంట్ వదంతులు కొద్దిరోజులు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయి.. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా పై ఈసారి కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో స్వదేశంలో భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఏకంగా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును చిత్తుచేసి ట్రోఫీని అందుకుంది. అయితే ఐసీసీ టోర్నీలలో మెరుగైన ప్రదర్శన చేస్తుందనే పేరున్న భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. కటక్ లో జరిగిన వన్డేలో సూపర్ సెంచరీ చేసిన అతడు.. తదుపరి మ్యాచ్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడి ఫామ్ పై మరోసారి ఆందోళనలు నెలకొన్నాయి. పైగా ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ తో కలిసి అతడు ఓపెనింగ్ బ్యాటింగ్ చేయబోతున్నాడు.
అప్పుడే చేస్తాడట
రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై వస్తున్న వదంతులకు స్పష్టత ఇచ్చాడు..” గత ఏడాది మేము టి20 వరల్డ్ కప్ సాధించాం. అది మాకు ఎంతో ప్రత్యేకం. ఆ తర్వాత టి20 లలో కొనసాగడం ఇక సాధ్యం కాదని రవీంద్ర జడేజా మాతో చెప్పాడు. దీంతో నేను, విరాట్ కోహ్లీ టి20 లకు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవాలి. టెస్ట్ క్రికెట్లోనూ ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో విజయం సాధించాలి. ఇవన్నీ నెరవేర్చాలనే ఆశ నాలో ఉంది. అందువల్లే తదుపరి ప్రయాణాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉందని” రోహిత్ వ్యాఖ్యానించాడు. ఈ ప్రకారం రోహిత్ శర్మ ఇప్పట్లో క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం లేదని తెలుస్తోంది. రోహిత్ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. ఇంత లేదన్న అతడు ఇంకా ఒక సంవత్సరం పాటు తన కెరీర్ కొనసాగించే అవకాశం ఉంది. ఈలోపు ఎటువంటి గాయాలు కాకపోతే ఇంకా కొద్ది రోజులు కెరియర్ కొనసాగుతుందేమో.. కానీ కొత్త పరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని గౌతమ్ గంభీర్ పట్టుదలతో ఉన్నాడు. అలాంటప్పుడు రోహిత్ అన్ని రోజులపాటు కెప్టెన్ గా ఉంటాడా.. అది సాధ్యమవుతుందా.. అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ విషయంపై ఆలోచించుకోవాలని రోహిత్ శర్మకు బీసీసీఐ పెద్దలు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.