Rohit Sharma Latest Look: పట్టుదలతో చేసే ఏ పనిలో అయినా సరే విజయం వరిస్తుంది.. దానిని నిజం చేసి చూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన పట్టుదలను చూపించాడు. తన సామర్థ్యాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు నోటితో కాకుండా చేతలతో సమాధానం చెప్పాడు. దీంతో చాలామంది నోర్లు మూసుకున్నారు.
టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారధిలలో రోహిత్ శర్మ ఒకడు. టీం ఇండియాకు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ అందించిన చరిత్ర అతడి సొంతం. రోహిత్ శర్మ భీకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు. బంతిని అత్యంత బలంగా కొడతాడు. ఫామ్ అనే లెక్కలు అతనికి సరిపడవు. ఎందుకంటే అతడు నిలబడితే ఎలాగైనా ఆడగలడు. ఎలాగైనా కొట్టగలడు. అందువల్లే అతడిని హిట్ మాన్ అని పిలుస్తుంటారు. అటువంటి రోహిత్ బరువు కారణంగా విమర్శలు ఎదుర్కునేవాడు. తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. ఒకానొక దశలో అతడు కెప్టెన్సీ కోల్పోవడానికి కారణం కూడా బరువు అని తేలింది. ఆమధ్య రోహిత్ శర్మ ఒక టోర్నీలో ఆడి వస్తుండగా విమానాశ్రయంలో అతని బరువు గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత అది అతడిని తీవ్రంగా బాధించింది. అప్పటినుంచే అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. నోటికి తాళం వేశాడు. బరువును తగ్గించుకునే మార్గాన్ని విజయవంతంగా అనుసరించడం మొదలుపెట్టాడు.
డైట్ పూర్తిగా మార్చేశాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మైదానంలోనే ఉండడం మొదలుపెట్టాడు.. జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేశాడు. ఫలితంగా బరువును మొత్తం కోల్పోయాడు. ఒకప్పుడు ముద్దుగా.. బొద్దుగా కనిపించిన రోహిత్… ఇప్పుడు స్లిమ్ముగా.. స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే వన్డే సిరీస్లో రోహిత్ ఆడబోతున్నాడు. సారధిగా అతని స్థానాన్ని తప్పించిన తర్వాత.. ఓపెనర్ గా ఆడతాడా.. ఇతర స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడా.. అనే విషయాలపై క్లారిటీ లభించాల్సి ఉంది.
బరువు తగ్గిన రోహిత్.. బరువు ఉన్న రోహిత్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. రోహిత్ అభిమానులు మాత్రం లావుగా ఉన్నప్పుడు.. బరువు తగ్గినప్పుడు.. ఇలా రెండిట్లోనూ అతడు అందంగానే ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. వికెట్ల మధ్య ఇప్పుడు అత్యంత వేగంగా రోహిత్ పరుగులు పెడతాడని.. టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషిస్తాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.