Rohit Sharma: గత 4 రోజుల క్రితం ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మ ని కెప్టెన్ గా తొలగిస్తూ హార్దిక్ పాండ్య ని కొత్త కెప్టెన్ గా నియమించింది. ఇక ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా మంది అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ టీమ్ ని అన్ ఫాలో చేస్తూ రోహిత్ శర్మ మీద ఉన్న ఇష్టాన్ని తెలుపుతూనే, ముంబై ఇండియన్స్ టీమ్ మీద ఉన్న ద్వేషాన్ని తెలియజేస్తున్నారు. ఇక రోహిత్ శర్మ పైన చాలామంది చాలా రకాల కథనాలు కూడా రాస్తున్నారు.
అవి ఏంటి అంటే రోహిత్ శర్మ ఇప్పటికే ట్రేడింగ్ విధానం ద్వారా వేరే జట్టులోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు అంటూ అందులో భాగంగానే ఢిల్లీ,చెన్నై, గుజరాత్ టీమ్ లు ఆయన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రోహిత్ కూడా వెళ్లడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా రకరకాల వార్తలైతే వస్తున్నాయి…అయితే వార్తల పైన ముంబై టీం యాజమాన్యం స్పందిస్తూ ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. రోహిత్ శర్మ మా టీమ్ లోనే కొనసాగుతాడంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రోహిత్ శర్మ పైన వస్తున్న రూమర్లన్నింటికి చెక్ పెట్టింది. అయితే ముంబై యాజమాన్యం క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ విషయంలో రోహిత్ శర్మ పూర్తి సంతృప్తి తో లేనట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే తన ప్లేస్ లోకి వెరేవాళ్లని తీసుకువచ్చి కెప్టెన్ గా చేస్తే ఎవరికైనా అలానే ఉంటుంది. అందులో భాగంగానే రోహిత్ శర్మ కూడా చాలా ఇబ్బంది గా ఫీలవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన అభిమానులు కూడా కోరుకునేది ఒకటే…ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీమ్ కి ఐదుసార్లు టైటిల్ అందించి, ఒక్కసారి చాంపియన్స్ ట్రోఫీ ని అందించి మొత్తం ఆరుసార్లు ముంబై ఇండియన్స్ టీం కి కప్పులను అందించిన ఒక లెజెండరీ కెప్టెన్ ని ఇక చెప్ప పెట్టకుండా తీసేయడం కరెక్ట్ కాదు అంటూ అతని అభిమానులు భారీ ఎత్తున ఫైర్ అవుతున్నారు.
రోహిత్ శర్మ ని ఇంకొక రెండు సీజన్ల వరకు కెప్టెన్ గా కొనసాగించిన బాగుండేది అనేది వాళ్ల అభిప్రాయం…కానీ టీమ్ యాజమాన్యం మాత్రం అవన్నీ పట్టించుకోకుండా 2024 నుంచే హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా నియమించింది…