Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ముగిసింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 17 ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఇక తాజాగా ఈ షో పై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, హోస్ట్ నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఈ షో ని మరోసారి బ్యాన్ చేయాలని డిమాండ్ చేసాడు.
బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. హౌస్ లో కంటెస్టెంట్లు చేసే పనులు వివాదాలకు దారి తీస్తుంటాయి. అయితే వారి కోసం అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో చేసే రచ్చ అరాచకంగా ఉంటుంది. ఈ క్రమంలోనే 15 వారాలు పాటు సాగిన షో లో విజేతగా ప్రశాంత్ నిలిచాడు. ఇక అమర్ రన్నర్ అప్ గా నిలవగా .. ఇక్కడే గొడవ మొదలైందని తెలుస్తుంది. ప్రశాంత్, అమర్ అభిమానులు కొట్లాటకు దిగారు.
టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్ దీప్ ఫ్యాన్స్ గొడవకు దిగారు. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇది పెద్ద గొడవగా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో ఉన్న కంటెస్టెంట్స్ కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ పై కేసులు ఫైల్ చేశారు పోలీసులు. కాగా ఈ ఘటనల పై సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు.
అభిమానం పేరుతో ఏమైనా చెయ్యొచ్చా అంటూ మండిపడ్డారు. హద్దులు మీరి బరితెగిస్తే చూస్తూ ఉండిపోవాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల దాకా వెళ్లారంటే వీళ్ళని ఏమనాలి అంటూ నిలదీశారు. దీనిని కింది కోర్టు లో వేస్తే కొట్టేసి .. హైకోర్టు కు పొమ్మన్నారు. బిగ్ బాస్ షో ఏమైనా అంత ఆదర్శమైనదా అంటూ మండి పడ్డారు. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి నాగార్జున లాంటి వారు హోస్ట్ గా చేస్తున్నారని వెల్లడించారు. అసలు బిగ్ బాస్ షో బ్యాన్ చెయ్యాలి అంటూ సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు.