IPL Auction: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ల లిస్టులో ఇద్దరూ ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఉండడం విశేషం… ముఖ్యంగా 2024 ఐపిఎల్ కోసం ఈరోజు జరుగుతున్న వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ లాంటి ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు 20 కోట్లకు పైన ధరను పలకడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ముఖ్యంగా మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియన్ టీమ్ ను చిత్తు చేసి ఆరోవసారి వాళ్ళ టీం కి వరల్డ్ కప్ ని అందించారు.
ఇక వరల్డ్ కప్ ని అందుకున్న టీం లో ఉన్న ప్లేయర్లు భారీ ఎత్తున ఎక్కువ ధరను పలుకుతూ అమ్ముడుపోయారు.ఇక ఇప్పటికే ట్రవిస్ హెడ్ ని 6 కోట్ల 80 లక్షలకు సన్ రైజర్స్ టీం కొనుగోలు చేసింది. అలాగే పాట్ కమ్మిన్స్ ని కూడా సన్ రైజర్స్ టీం 20 కోట్ల 50 లక్షల కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు మిచెల్ స్టార్క్ ని 24 కోట్ల 75 లక్షలకు కలకత్తా నైట్ రైడర్స్ టీం కొనుగోలు చేయడం విశేషం…ముఖ్యంగా ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయర్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం అనేది సాధారణంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
కానీ ఇప్పుడు మాత్రం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ప్లేయింగ్ లెవెన్ లో సత్తా చాటిన పాట్ కమ్మిన్స్, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్ లాంటి ఈ ముగ్గురు ప్లేయర్లని భారీ ఎత్తున కొనుగోలు చేయడమనేది విశేషం…ఇక దాంతో ఐపిఎల్ లో మరొకసారి ఆస్ట్రేలియన్ టీం ప్లేయర్లకు క్రేజ్ పెరిగింది…ఇక ఈ ఇయర్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా పైన సత్తా చాటి ఆ దేశానికి కప్పు అందించడంతో వాళ్లకు మంచి గుర్తింపు రావడమే కాకుండా ఐపీఎల్ లో కూడా వాళ్ళకి ఎక్కువ ధర రావడానికి అది బాగా హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్లు ఇద్దరు ఉండడం అనేది విశేషం…
ఇక 2024 ఐపిఎల్ అనేది చాలా రసవత్తరం గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికి అయితే 2024 లో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఎంతవరకు ఆయా జట్ల కి విజయాలు అందిస్తారు అనేది చూడాలి…అలాగే అత్యధిక ధర పలికిన స్టార్క్ కలకత్తా కి కప్ అందిస్తాడా..? అలాగే పాట్ కమ్మిన్స్ హైదరాబాద్ టీమ్ కి కప్ అందిస్తాడా అనేది వేచి చూడాలి..