IND Vs BAN: ఈ కథనం రాసే సమయం వరకు బంగ్లాదేశ్ 9.3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఐదు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. మహమ్మద్ షమి, అక్షర్ పటేల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.. హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నాడు. తాంజిద్ హాసన్ 25 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ శాంటో, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీం గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఏ దశలోనూ భారత బౌలర్లను ప్రతిఘటించినట్లు కనిపించడం లేదు. పైగా మైదానంపై ఉన్న తేమను భారత బౌలర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. పేస్ బౌలర్లు బౌన్స్ రాబడుతున్నారు. స్పిన్ బౌలర్లు బంతిని మెలికలు తిప్పుతున్నారు. దీంతో బంగ్లా బ్యాటర్లు పరుగులు తీయడమే కష్టంగా మారుతోంది.
— Shivam (@shivammm_) February 20, 2025
హ్యాట్రిక్ మిస్
ఈ మ్యాచ్లో భారత స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. 8 ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. రెండవ బంతికి తాన్జిద్ హుస్సేన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన తాన్జిద్.. గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ రాహుల్ చేతిలో పడింది. దీంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇది క్రమంలో మరుసటి బంతిని కూడా అక్షర్ పటేల్ అలానే వేయడంతో ముష్ఫికర్ రహీం తప్పుగా అంచనా వేశాడు. అది బ్యాట్ అంచును తగిలి కీపర్ రాహుల్ చేతిలో పడింది. దీంతో బంగ్లాదేశ్ ఐదు వికెట్ కోల్పోయింది. ఈ దశలో జాకీర్ అలీ బ్యాటింగ్ కు వచ్చాడు. అతనికి కూడా అక్షర్ పటేల్ అటువంటి బంతినే వేశాడు. జాకీర్ అలీ కూడా అలానే ఆడాడు. బంతి బ్యాట్ చివరి అంచును తగులుతూ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లో పడింది. బంతిని అందుకున్నాననే ఆత్రుతలో రోహిత్ శర్మ దానిని వదిలేశాడు. దీంతో అక్షర్ పటేల్ హాట్రిక్ ఛాన్స్ మిస్సయింది. క్యాచ్ జార విడవడంతో అవమాన భారంతో రోహిత్ శర్మ మైదానాన్ని పదే పదే తన పిడికిలితో గుద్దాడు.. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. క్యాచ్ జార విడిచిన నేపథ్యంలో రోహిత్ శర్మ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ వై ఉండి సులభమైన క్యాచ్ ఎలా జారవిడుస్తావని మండిపడుతున్నారు. ” అక్షర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బంతి కూడా అతడు కోరుకున్నట్టుగానే టర్న్ అవుతోంది. బంగ్లా బ్యాటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. కానీ టీమిండియా కెప్టెన్ బంగ్లా ఆటగాళ్లను ఇంకా కాసేపు ఆడించాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు. అందువల్లే ఇలా క్యాచులు జారవిడుస్తున్నాడని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bhaijaan rohit sharma pitch ko damage kr rhee h#ChampionsTrophy2025 #ChampionsTrophy #RohitSharma #IndvsBan #Dubai #PakistanCricket #Pakistan pic.twitter.com/Td92gex5Sh
— Prachalan(प्रचलन) (@akashkj300) February 20, 2025
Rohit Sharma drops Axar Patel’s hat-trick ball! Have to feel for axar. Totally deserved a hat trick there.
Dream nahi pura karnde dunga bapu #IndvsBan #IndvsBang pic.twitter.com/JuUMtqf8R0— rulesforever¹⁸ (@VKrulesforever) February 20, 2025