Kantara : 2022 వ సంవత్సరం కన్నడ సినీ పరిశ్రమకు స్వర్ణ యుగం లాంటిది అనొచ్చు. ఆ ఏడాది విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2′(KGF Chapter2) ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇలా మన సత్తా చాటే కన్నడ సినిమా ఎప్పుడు వస్తుందో అని కన్నడిగులు అనుకుంటున్న సమయంలో అదే ఏడాది విడుదలైన ‘కాంతారా'(Kantara Movie) చిత్రం కూడా అదే స్థాయి సంచలన విజయం సాధించి, అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో హీరో గా నటిస్తూ, దర్శకత్వం కూడా వహించిన రిషబ్ శెట్టి కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు ఆయన ‘కాంతారా’ చిత్రానికి ప్రీక్వెల్ చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే రిషబ్ శెట్టి నటుడు అవ్వడం కంటే ముందు ఒక మంచి దర్శకుడు. గతం లో ఆయన కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘కాంతారా’ చిత్రం ఆయనకు హీరోగా మొదటి సినిమా. అయితే కాంతారా కి ముందు రిషబ్ శెట్టి మన టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలను చేయాలని అనుకున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Globalstar Ramcharan) తో అప్పట్లో ఆయన ఒక ఐడియా కూడా చెప్పాడట. అది రామ్ చరణ్ కి తెగ నచ్చేసింది. కచ్చితంగా చేద్దామని చెప్పాడు కానీ, #RRR మూవీ షూటింగ్ లో ఉండడం వల్ల, కొంతకాలం ఆగాల్సిందిగా కోరాడు. ఈలోపు రిషబ్ శెట్టి కాంతారా సినిమా పూర్తి చేసాడు. ఇక ఆ సినిమా విడుదల తర్వాత రిషబ్ శెట్టి రేంజ్ ఎలా మారిపోయిందో మనమంతా చూసాము. ఇప్పుడు డైరెక్టర్ గా కంటే ఎక్కువగా ఆయన హీరో గా చేయడానికే మొగ్గు చూపిస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన చేతిలో ‘జై హనుమాన్'(Jai Hanuman Movie), ‘కాంతారా చాప్టర్ 1′(Kantara Chapter 1), ‘ఛత్రపతి శివాజిమహారాజ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొతెంత స్థాయి ఉన్న చిత్రాలే. ఈ సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. ఒకవేళ రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకుంటే అప్పటి వరకు ఆగాల్సిందే. నాలుగేళ్ల తర్వాత రామ్ చరణ్ ఏ స్థితిలో ఉంటాడో, రిషబ్ శెట్టి ఏ స్థితిలో ఉంటాడో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి, వీళ్ళ కాంబినేషన్ లో సినిమా దాదాపుగా చెయ్యి జారిపోయినట్టే అని అనుకోవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ ద్రుష్టి కూడా బుచ్చి బాబు సినిమాపై, ఆ తర్వాత సుకుమార్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యే వరకు ఆయన ఏ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేవట.