https://oktelugu.com/

Team India Bowlers : దడ పుట్టిస్తున్న ఇండియా బౌలింగ్ ని కంట్రోల్ చేసేది అతడొక్కడేనట!

జస్ప్రీత్‌ బుమ్రా ఒక ఫ్రీక్‌. అధిక వేగంతో బౌల్‌ చేస్తున్నాడు. షమీకి అత్యుత్తమ సీమ్‌ స్థానం ఉంది. సిరాజ్‌ ఒక పోరాట యోధుడు అని తెలిపారు. ఇక జడేజా పీక్‌లో ఉన్నాడని, కుల్దీప్‌ చాలా మెరుగుపడ్డాడని వెల్లడించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 12, 2023 / 01:45 PM IST
    Follow us on

    Team India Bowlers : ప్రపంచకప్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. ఆల్‌రౌండ్‌ షోతో పరాజయం లేకుండానే పాయింట్ల లిస్ట్‌లో ప్రథమస్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తిరుగులేదని చాటుతోంది టీమిండియా. ముఖ్యంగా బౌలింగ్‌లో భారత జట్టు అదరగొడుతోంది. పవర్‌ ప్లే లోనే బూమ్రా, షమీ, సిరాజ్‌ వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీస్తున్నారు. తర్వాత కుల్దీప్, రవీంద్ర జడేజా మిడిల్‌ ఆర్డర్, లోయర్‌ ఆర్డర్‌ పని పడుతున్నారు. ఇలా బౌలింగ్‌లో సమతూకం వల్లనే టీమిండియా వరల్డ్‌కప్‌లో ఓటమి ఎరగకుండా మూందుకుపోతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్‌ గురించి మాజీ దిగ్గజ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    – వారే అత్యుత్తమం..
    ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో భారత విజయాల్లో మన బౌలర్లు కీలక పాత్ర పోషించారని టీమిండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా సమతూకంలో ఉందని అభిప్రాయపడ్డారు. తాను చూసిన 50 ఏళ్లలో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ విభాగంగా పేర్కొన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా ఒక ఫ్రీక్‌. అధిక వేగంతో బౌల్‌ చేస్తున్నాడు. షమీకి అత్యుత్తమ సీమ్‌ స్థానం ఉంది. సిరాజ్‌ ఒక పోరాట యోధుడు అని తెలిపారు. ఇక జడేజా పీక్‌లో ఉన్నాడని, కుల్దీప్‌ చాలా మెరుగుపడ్డాడని వెల్లడించారు.

    గిల్‌క్రిస్ట్‌తోనే సాధ్యం..
    ప్రస్తుత భారత అత్యుత్తమ బౌలింగ్‌ ఎదుర్కొనే సత్తా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు మాత్రమే ఉందని రవిశాస్త్రి తెలిపారు. బౌలర్లు మంచి అనుభవంతోపాటు ఎలాంటి పిచ్‌ అయినా బౌలింగ్‌ చేయగలుగుతున్నారని, వికెట్లు తీస్తున్నారని వెల్లడించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా బౌలర్లను సమర్థవంతంగా వినియోగిస్తున్నాడని తెలిపారు. ఒకవేళ బౌలర్లు గాడి తప్పినా కూడా వారిని కంట్రోల్ చేసేది కేవలం రోహిత్ శర్మ మాత్రమేనని.. వారికి సరైన గైడింగ్, ఎక్కడ పిచ్ చేయాలో చెప్పి మరీ వారిని రాటు దేల్చేలా రోహిత్ చేస్తున్నాడని రవిశాస్త్రి తెలిపారు. బౌలర్లను సరిగ్గా వాడుకోవడంలో .. వారు లైన్ అండ్ లెంగ్త్ లో వేసేలా చేయడంలో రోహిత్ కీరోల్ పోషిస్తున్నాడని తెలిపారు.