Team India – Diwali : క్రికెటర్ల ఎంజాయ్‌ మామూలుగా లేదు.. టీమిండియా దీపావళి సంబరాల వీడియో, ఫొటోలు వైరల్‌

ఇండియన్‌ టీమ్‌ దీపావళి సంబరాల ఫొటోలు, వీడియోల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్‌ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Written By: NARESH, Updated On : November 12, 2023 1:27 pm
Follow us on

Team India – Diwali : ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి సెమీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. ఈనెల 15న న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సెమీ ఫైనల్‌కు ప్రాక్టిస్‌ మ్యాచ్‌లా ఆదివారం నెదర్‌లాండ్‌తో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. దీంతో భారత క్రికెటర్లు ఒక రోజు ముందే దీపావళి జరుపుకున్నారు. శనివారమే ఇండియన్‌ టీమ్‌ ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోను వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘మా అందరి తరఫున మీ అందరికీ హ్యాపీ దివాళీ’ అంటూ కేఎల్‌ రాహుల్‌ ఈ ఫొటో పోస్ట్‌ చేశాడు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఇండియన్‌ టీమ్‌ దీపావళి సంబరాల ఫొటోలు, వీడియోల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్‌ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఎప్పుడూ టీమిండియా జెర్సీల్లోనే ఓ టీమ్‌ గా కనిపించే వీళ్లంతా ఇప్పుడిలా సాంప్రదాయ దుస్తుల్లో ఒకచోట చేరి ఫొటోలకు పోజులివ్వడం అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.

బెంగళూరులో లాస్ట్‌ లీగ్‌మ్యాచ్‌..
రాహుల్‌ సొంతూరు బెంగళూరులోనే టీమిండియా వరల్డ్‌ కప్‌ 2023లో తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. పరుగుల వరద పారించే చిన్నస్వామి పిచ్‌పై ఈ మ్యాచ్‌ను కూడా ఘనంగా ముగించి న్యూజిలాండ్‌తో జరగబోయే సెమీఫైనల్‌ కు కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. నెదర్లాండ్స్‌ పై ఇండియన్‌ టీమ్‌ మరో ఘన విజయం సాధిస్తే ఈ పండగను బాణసంచాతో మరింత ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైంది.

ట్రోఫీకి రెండు అడుగుల దూరం..
ఇదిలా ఉండగా వరల్డ్‌ కప్‌ ట్రోఫీకి టీమిండియా మరో రెండు అడుగుల(సెమీఫైనల్, ఫైనల్‌) దూరంలో ఉంది. ఆ రెండు సక్సెస్‌ అయితే 12 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ మన సొంతమవుతుంది. అదే జరగాలని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. బుధవారం (నవంబర్‌ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ తో ఇండియా తొలి సెమీఫైనల్లో తలపడనుంది 2019 వరల్డ్‌ కప్‌లో ఇదే టీమ్‌తో సెమీఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది.