Team India Announced: విరాట్ కోహ్లీ శకం ముగిసినట్టే.. రోహిత్ కు ప్రమోషన్.. షాకిచ్చిన బీసీసీఐ

Team India Announced: ప్రపంచకప్ టీ20 వరల్డ్ కప్ కు ముందే టీ20 కెప్టెన్ బాధ్యతలు వదలుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డేలు, టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా ఉంటానన్నాడు. దీంతో రోహిత్ ను టీ20 కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ. అయితే తాజాగా కోహ్లీ ప్రకటించకుండానే అతడికి బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. టీ20లకు మాత్రమే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను వన్డేలకు కూడా కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం […]

Written By: NARESH, Updated On : December 9, 2021 11:01 am
Follow us on

Team India Announced: ప్రపంచకప్ టీ20 వరల్డ్ కప్ కు ముందే టీ20 కెప్టెన్ బాధ్యతలు వదలుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డేలు, టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా ఉంటానన్నాడు. దీంతో రోహిత్ ను టీ20 కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ.

rohit kohli

అయితే తాజాగా కోహ్లీ ప్రకటించకుండానే అతడికి బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. టీ20లకు మాత్రమే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను వన్డేలకు కూడా కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అనుకున్నట్టే రెండు ఫార్మాట్ లలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి.ఇక టెస్టుల్లోనూ ప్రమోషన్ లభించింది. అజింక్యారహానే స్థానంలో టెస్టుల్లోనూ వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ను బీసీసీఐ నియమించింది. కేవలం టెస్టు కెప్టెన్సీ మాత్రమే కోహ్లీ చేతుల్లో ఇప్పుడు ఉంది.

తాజాగా దక్షిణాఫ్రికా టూర్ కు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా వన్డేలకు రోహిత్ నే కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.దీంతో కోహ్లీ శకం ముగిసిందని.. ఇక రోహిత్ శర్మ ది మొదలైందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా కనీసం ఒక్క కప్ అయినా గెలుస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి.

రహానే వరుసగా విఫలం అవుతుండడం.. గిల్, అయ్యర్ లాంటి యువకులు బాగా ఆడడంతో వైస్ కెప్టెన్సీ నుంచి కూడా అజింక్యాను తొలగించింది. జట్టులో చోటు ఇప్పుడతడికి కష్టమేనంటున్నారు.

Also Read: సంచలనం?: వన్డే కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై.?

న్యూజిలాండ్ తో టూర్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, షమీ, బుమ్రా, శార్ధుల్ ఠాకూర్ లకు తిరిగి జట్టులో స్థానం కల్పించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవీంద్రజడేజాకు విశ్రాంతినిచ్చింది.

కెప్టెన్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని వదలిపెట్టకముందే.. అతడి నిర్ణయంతో సంబంధం లేకుండానే బీసీసీఐ షాకివ్వడం సంచలనమైంది. టీమిండియా కోచ్ గా ద్రావిడ్ ఎంపిక కావడంతో కఠిన నిర్ణయాలు వెలువడుతున్నారు. వరుసగా కప్ లు కోల్పోతున్న జట్టును గాడినపెట్టడానికే ఇలాంటి సంచలన నిర్ణయాలను బీసీసీఐ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also Read: దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టులో చేరేదెవరో?