IND vs SA: ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్ కు వెళ్లే భారత జట్టును ఎంపిక చేశారు. భారత జట్టును బుధవారం ప్రకటించారు. జట్టులో ఆటగాళ్ల ప్రతిభకు పెద్దపీట వేస్తూ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆటగాళ్ల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంతో రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే రోహిత్ శర్మ సారధ్యంలో టీ20, టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ పై గెలుచుకుని తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో అతడి సారధ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించేందుక సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయాల బాటలో నడుస్తున్న భారత జట్టును దక్షిణాఫ్రికాలో కూడా విజయాలు నమోదు చేయాలని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు జనవరి 19 నుంచి వన్డే సిరీస్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే వైస్ కెప్టెన్ గా రహానే ను ఎంపిక చేస్తారని ఊహాగానాలు వస్తున్నా ఆయన గత మ్యాచుల్లో విఫలమైన కారణంగా ఆయన ఎంపికపై అనుమానాలు ఉన్నట్లు సమాచారం. దీంతో భారత జట్టు ఎంపికలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపైనే ఆసక్తి కలుగుతోంది.
Also Read: IPL: వదిలేసుకున్న ప్లేయర్లను ప్రాంచైజీలు చేజ్కించుకుంటాయా?
అయితే శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ లను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు మాత్రం హనుమ విహారిని చేర్చుకోనున్నట్లు సమాచారం. దీంతో భారత జట్టు కూర్పుపై బీసీసీఐ అధికారులు ఎవరిని ఎంపిక చేసి ఎవరిని దూరం పెడతారో తెలియడం లేదు. మొత్తానికి బారత జట్టు ఎంపికలో నిర్ణయాలు ఎలా ఉంటాయో అని సందేహాలు వస్తున్నాయి.
Also Read: IND VS NZ: న్యూజిలాండ్ పై టీంఇండియా ‘అదిరిపోయే’ రికార్డులు..!