Rohit Sharma Brings IPL Bowlers: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఓ టెస్ట్ మ్యాచ్ తోపాటు ఏడు మ్యాచులు ఆడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. జులై 1 నుంచి ప్రారంభమయ్యే మ్యాచుల కోసం ఇంగ్లండ్ పయనమవుతోంది. అక్కడ ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటాలని భావిస్తోంది. టీమిండియా పరిస్థితి బాగా లేకపోయినా విజయాలు సాధించాలని ప్రేక్షకులు మాత్రం కోరుతున్నారు. తమ ఆశలకు అనుగుణంగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ వారు ఏ మేరకు రాణిస్తారో కూడా తెలియడం లేదు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో టీమిండియా విఫలం కావడంతో ఇక్కడైనా విజయాలు నమోదు చేస్తుందో లేదో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఇటీవల గాయాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ టీంకు దూరం కావడంతో అపజయాలు పలకరించాయి. కానీ ఇప్పుడు మాత్రం విజయాలు నమోదు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం టీమిండియా ఆటగాళ్లలో సమన్వయం సాధించాలని చూస్తున్నారు. ఆటగాళ్లు సమష్టిగా రాణించి మంచి విజయాలు సాధించాలని చూస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఐపీఎల్ లో సత్తా చాటిన బౌలర్లను జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ఫ్రాంచైజీలలో బౌలర్లుగా రాణించి జట్ల విజయాలకు దోహదపడిన వారిని జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ సిమర్ జిత్ సింగ్, రాజస్తాన్ రాయల్స్ పేస్ బౌలర్ నవదీప్ సైనీ, డిల్లీ క్యాపిటల్స్ నుంచి కమలేష్ నగర్ కోటి లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిని నెట్ బౌలర్లుగా ఇంగ్లండ్ కు పంపించనుంది.
Also Read: Janhvi kapoor- NTR: ఎన్టీఆర్ సినిమాతోనే శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ
ఇంగ్లండ్ పర్యటనలో వీరిని నెట్ బౌలర్లుగా బీసీసీఐ ఉంచుకోనుంది. తరువాత వెస్టిండీస్ పర్యలన కోసం వీరిని పంపుతారో లేదో తెలియడం లేదు కానీ మొత్తానికి వారి సేవలను వినియోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రాక్టీసు సమయంలో బ్యాటర్లకు బౌలింగ్ వేసేందుకు వీరిని ఎంపిక చేసినట్లు చెబుతోంది. దీంతో ఐపీఎల్ లో ప్రతిభ చూపిన బౌలర్లకు అవకాశం ఇలా తలుపు తట్టడంతో వారు తమ భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు
రోహిత్ శర్మ ముగ్గురు బౌలర్లను ఎంచుకుని తమ వెంట తీసుకువెళ్తున్నారు. వీరితో ఏం చేస్తాడనేది మాత్రం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఐపీఎల్ లో వారు చూపిన ప్రతిభ కారణంగానే వారిని తమతో తీసుకెళ్లేందుకు భావించినట్లు తెలుస్తోంది. కానీ అతడి మదిలో ఏం ఉందో మాత్రం ఎవరికి తెలియడం లేదు. మొత్తానికి బౌలర్లకు మాత్రం బంగారు అవకాశం వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Virata Parvam Producers: సాయి పల్లవి పై విరుచుపడిన విరాటపర్వం నిర్మాతలు