Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: సచిన్, గవాస్కర్, రవిశాస్త్రిల ముందు.. రోహిత్ శర్మ చేసిన పనికి అంతా ఫిదా.....

Rohit Sharma: సచిన్, గవాస్కర్, రవిశాస్త్రిల ముందు.. రోహిత్ శర్మ చేసిన పనికి అంతా ఫిదా.. నెట్టింట ప్రశంసల జల్లు..

Rohit Sharma: టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న అనంతరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి.. నాటి సంబరాలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ముందు వరుసలో కనిపించారు. ఆ వేడుకలను బీసీసీఐ న భూతి న భవిష్యతి అనే స్థాయిలో నిర్వహించింది. ఈ క్రమంలో మరోసారి అదే స్థాయిలో వేడుకలు జరుపుకోవడానికి అభిమానులు సిద్ధంగా ఉండాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హింట్ ఇచ్చాడు..” దుబాయిలో మేము తలపడే పోటీలకు బలమైన మద్దతు ఉంటుంది.. 140 కోట్ల మంది ప్రజలు మా వెంట ఉన్నారు. మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. మా వంతుకు మించి కృషి చేస్తాం. జట్టును మళ్ళీ ఛాంపియన్ గా అవతరించేలాగా ప్రయత్నిస్తామని” రోహిత్ వ్యాఖ్యానించాడు.. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల కాలంలో టీమిండియా వరుస సిరీస్లలో ఓటమిపాలైంది. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో, ఆస్ట్రేలియా గడ్డపై కంగారుల చేతిలో టెస్ట్ సిరీస్ లను కోల్పోయింది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ అవకాశాన్ని నష్టపోయింది. ఇక ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది.. 2013లో ధోని ఆధ్వర్యంలో చివరిసారిగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది.. అయితే తన కెరియర్లో చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావడంతో.. కచ్చితంగా గెలుచుకోవాలని.. గెలుపు ద్వారా ఘనమైన వీడ్కోలు పలకాలని రోహిత్ శర్మ (Rohit Sharma) భావిస్తున్నాడు.

ఘనంగా 50 ఏళ్ల వేడుకలు

వాంఖడే స్టేడియం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో.. వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), (Ravi Shastri) రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), డయానా ఎడుల్జీ (Diana edulji) హాజరయ్యారు.. రోహిత్ కూడా ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. కొద్దిరోజులుగా ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. ఆదివారం ముగింపు సంబరాలు జరిపారు.. వేడుకలను వినూత్నంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది.. అయితే సభా వేదికపై దిగ్గజ క్రికెటర్లు మొత్తం కూర్చున్నారు.. అయితే వీరి కోసం కుర్చీలను మూడు వైపుల దూరం వేశారు.. రోహిత్ స్టేజ్ మీదకి వచ్చే సమయానికి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఎడుల్జి కూర్చున్నారు.. అయితే రవి శాస్త్రి రోహిత్ శర్మ వేదిక మీదకి వస్తుండగా తన పక్కనే ఉన్న సీటును చూపించాడు. దాని మీద కూర్చోవాలని కోరాడు. అప్పటికే ఆ స్టేజి మీద మధ్యలో ఒక రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి.. అక్కడ కూర్చోవాలని రవి శాస్త్రిని రోహిత్ శర్మ తన సైగల ద్వారా సూచించాడు. రవి శాస్త్రాన్ని మధ్యలో కూర్చోబెట్టి అతని పక్కన రోహిత్ కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్త సంచలనంగా మారింది.

రోహిత్ ఆకట్టుకున్నాడు

రోహిత్ సీనియర్ క్రికెటర్ కు గౌరవం ఇవ్వడాన్ని అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు..” రోహిత్ మైదానంలో మాత్రమే కోపంగా ఉంటాడు. ఆ తర్వాత మళ్లీ కూల్ అయిపోతాడు. అతడి కోపం పాలపొంగు లాంటిది. అలా పొంగుతుంది..ఇలా చల్లారిపోతుంది. అంతే తప్ప అతడికి వ్యక్తిగతంగా ఎవరి మీదా కోపతాపాలు ఉండవు. అతడిని అవే వ్యక్తిగతంగా గొప్పగా తీర్చిదిద్దుతున్నాయని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular