Rohit : ఆస్ట్రేలియా – భారత్ మధ్య పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో బలంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఓడించింది. టి20 వరల్డ్ కప్ లో భారత్ దానికి బదులు తీర్చుకుంది. అయితే ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడే అవకాశాలను కూడా కోల్పోయింది. ఇక అంతకు ముందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఇన్ని ఓటముల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కచ్చితంగా ఆస్ట్రేలియాపై గెలవాలని భారత్ భావిస్తున్నది. అబుదాబి మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్ తో మాదిరిగానే నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read : రోహిత్‌శర్మపై నోరు జారిన కాంగ్రెస్ నాయకురాలు.. నెట్టింట ఆటాడుకుంటున్న ఫ్యాన్స్!
Every news channel of India is grilling Shama and his party.
We are bigger than the biggest. We are huge. We are Rohit Sharma Nation.
CONGRESS KA BAAP ROHIT
— Rohan (@rohann__45) March 3, 2025
గెలుక్కున్న కాంగ్రెస్..
సెమి ఫైనల్ మ్యాచ్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా నేత షామా మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని.. అతడు తన బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయనది ఆకట్టుకునే రూపం కాదని.. ఆకారం కూడా అందుకు తగ్గట్టుగా ఉండదని షామా మహమ్మద్ పేర్కొన్నారు. భారత జట్టులో మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తో పోల్చి చూస్తే రోహిత్ ఒక సాధారణ ఆటగాడేనని షామా మహమ్మద్ వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా దుమారం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామి ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు. ఇక యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అయితే షామా మహమ్మద్ ను దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రోహిత్ పై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ” కాంగ్రెస్ కా బాప్ రోహిత్” అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతుంది. టీమిండియా కు రోహిత్ శర్మ ఎంతో సేవ చేస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని నెటిజన్లు మడిపడుతున్నారు. ఇప్పటికే ఈ యాష్ ట్యాగ్ కు దాదాపుగా 90 వేల వరకు ట్వీట్లు పడ్డాయి. ఇండియాలో ఈ యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది.
Also Read : సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
A Brahmin captain of the Indian cricket team is targeted by a radical Islamist Shama Mohammed of the Indian Nation congress, The only thing they forgot is CONGRESS KA BAAP ROHIT pic.twitter.com/VYSklzzYeU
— God (@Indic_God) March 3, 2025