Best Family Cars
Best Family Cars: ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేయాలని చాలామందికి ఉంటుంది. కానీ అనుకున్న ప్రదేశానికి వెళ్లడానికి రవాణా సౌకర్యాలు ఒక్కోసారి ఉండకపోవచ్చు. దీంతో సొంతంగా వెహికల్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీటి అదే భారీగా ఉండడంతో చాలామంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉంటారు. అదే సొంత కారు ఉంటే ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడికి అంటే అక్కడికి ఈజీగా వెళ్లొచ్చు. అయితే సొంత కారు కొనడం అంటే మామూలా? అని చాలామందికి భయం ఉంటుంది.. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ పీపుల్స్ దృష్టిలో ఉంచుకొని లో బడ్జెట్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులోనూ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ గా ఉండే ఎలక్ట్రిక్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఆ కార్లు ఏవో తెలుసుకుందామా..
మారుతి కంపెనీ నుంచి ఏ కారు వచ్చినా దాన్ని కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే చాలా కార్లు ఫ్యామిలీకి అనుగుణంగా వచ్చాయి. సేడన్, హ్యాచ్ బ్యాక్, ఎస్ యు వి వెరీ ఇండ్లలో వివిధ రకాల కార్లను తీసుకొచ్చిన మారుతి కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ కార్ను కూడా తీసుకురాబోతుంది. అదే గ్రాండ్ విటారా SUV. ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్ నిఇప్పటికే ఢిల్లీ ఆటోమోబిలిటీ షోలో ప్రదర్శించారు. త్వరలో దీని బుకింగ్ ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా ఎస్యువి మరోసారి కొత్త తరహాలో వినియోగదారుల కు పరిచయం కాబోతుంది. . ఇందులో ఉండే ఎల్ఈడి హెడ్ లైట్స్, ఎల్ఈడి ఫాగ్ లాప్స్ తో పాటు కొత్త అల్లాయ్ వీల్స్ ఉండలు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ లో లెవెల్ 2 పటాస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ పెయిన్ sunroof ఆకర్షించనుంది. అయితే ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా ఇంజన్ ని దీనికి అమర్చారు.
ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే మరో కంపెనీ కొత్త కారును తీసుకొస్తుంది. అదే hyundai. ఈ కంపెనీ నుంచి Creta రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన క్రెటా మంచి పేరు తెచ్చుకుంది. దీని ఇంజన్లో పెద్దగా మార్పు తీసుకొచ్చి 2027 లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజన్ తో పనిచేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ తో పాటు బ్యాటరీ కూడా అమర్చనున్నారు.
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా సైతం కొత్త కారును ఫ్యామిలీకి అనుగుణంగా తీసుకు రాబోతుంది. అదే Seltos. ఇప్పటికే ఉన్న Seltos లో చాలా మార్పులు చేసి 2026లో రీ రిలీజ్ చేయనున్నారు. కొత్త కారులో కొత్త ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉండనున్నాయి. అలాగే అల్లాయి వీల్స్ రీ డిజైన్ చేసిన ఎల్ఈడి టెయిల్ లాంప్స్ ఉండే అవకాశం ఉంది. స్టీరింగ్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు మార్చిన డోర్ డ్రీమ్స్ కనిపిస్తాయి. యాంబియా యాంటి లైటింగ్ సిస్టం వంటి ఫీచర్లను కలిగిన ఈ కారు 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ను అమర్చనున్నారు.