Roger Federer- Rafael Nadal Crying: రోజర్ ఫెదరర్ ఈ పేరు అంటే తెలియని టెన్నిస్ అభిమానులు ఉండరు. ఆ ఆటపై అంతగా ఇంఫ్యాక్ట్ చూపాడు మరి. సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్.. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా అతని ఆట తీరు అమోఘం. ఇప్పట్లో ఏ ఆటగాడు కూడా అతడి రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. 41 ఏళ్ల ఫెదరర్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడు. ” ఇప్పటికే శరీరం చాలా అలసిపోయింది. క్షణం తీరిక లేని ఆటతో చాలా ఇబ్బందికి గురయింది. ఇక ఆటకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. లావెర్ కప్ టోర్నీ తనకు చివరి మ్యాచ్ అని” ఫెదరర్ ఇటీవల ప్రకటించాడు. అన్నట్టుగానే చివరి మ్యాచ్ ఆడాడు.
కన్నీళ్లు పెట్టుకున్నాడు
శుక్రవారం లేవర్ కప్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్ధులు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ కలిసి అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సిస్ తియాపో, జాక్ సాక్ తో తలపడ్డారు. వాస్తవానికి టెన్నిస్ ప్రపంచంలో రఫెల్ నాదల్, ఫెదరర్ చిరకాల ప్రత్యర్ధులు. టెన్నిస్ కోర్టులో దిగారంటే ఇద్దరు కొదమసింహాల్లా పోరాడుతారు. అలాంటి వీరు లేవర్ కప్ లో భాగంగా స్విస్ జట్టు తరఫున మెన్స్ డబుల్స్ లో అమెరికన్ జోడి జాక్ సాక్, ఫ్రాన్సిస్ తియాపో తో తలపడ్డారు. మ్యాచ్లో రోజర్ ఫెదరర్, నాదల్ ఓడిపోయారు. మ్యాచ్ అనంతరం ఫెదరర్ వెక్కివెక్కి ఏడ్చాడు. నాదల్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో టెన్నిస్ కోర్టు ప్రాంగణమంతా ఉద్విగ్నంగా మారిపోయింది. ఆ తర్వాత ఫెదరర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన భార్య మీర్కాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
ఆమెను గట్టిగా హత్తుకొని భుజంపై తలను ఆనించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఆమె కూడా కన్నీటి పర్యంతమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను లేవర్ కప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ” మైదానంలో ఇద్దరు భీకర ప్రత్యర్ధులు. మ్యాచ్ ముగిశాక ఇద్దరు ప్రాణ స్నేహితులు” అంటూ రాస్కొచ్చింది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఈ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “ప్రధాన ప్రత్యర్థులు ఇలా భాగోద్వేగానికి గురికావడం స్పోర్ట్స్ గొప్పతనం. ఇది నాకు అందమైన స్పోర్టింగ్ పిక్చర్ అని” రాసుకు వచ్చాడు. కాగా రోజర్ ఫెదరర్ టెన్నిస్లో ఆనితర సాధ్యమైన రికార్డులను నిలిపాడు. మరి ముఖ్యంగా రఫెల్ నాదల్ తో తలపడిన మ్యాచుల్లో ఇద్దరు హోరాహోరీగా ఆడేవారు. ఒకరకంగా చెప్పాలంటే మైదానంలో కొదమసింహాల్లా తలపడేవారు. ఫెదరర్ వీడ్కోలు తర్వాత అలాంటి మ్యాచ్లను చూడలేమని అభిమానులు అంటున్నారు. నిన్న సెరెనా విలియమ్స్, నేడు రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేస్తానని రోజర్ ఫెదరర్ అప్పట్లోనే ప్రకటించాడు. ప్రస్తుతం కుటుంబంతో విహారయాత్ర ముగించిన తర్వాత టెన్నిస్ కోర్టు పనుల్లో నిమగ్నం కానున్నాడు. అయితే టెన్నిస్ ద్వారా ఫెదరర్ 8 వేల కోట్ల ఆస్తులు దాకా సంపాదించాడు.
https://twitter.com/barstoolsports/status/1573461290164551681?s=20&t=f52-Maz3kMZ7LQTnbhlvkQ