RJ Mahavash: ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యజువేంద్ర చాహల్. తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వడం ద్వారా ఇతడు ఒకసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ప్రతిరోజు అటు మీడియా.. ఇటు సోషల్ మీడియాలో చాహల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ధనశ్రీ తో విడాకుల తర్వాత యజువేంద్ర చాహల్ దుబాయ్ లో కనిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా -న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది. తద్వారా 2013 అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చాహల్ వెళ్ళాడు. అతనితోపాటు ఆర్జే మహ్వేష్ కూడా కనిపించింది. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతున్నదని.. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. జాతీయ మీడియా అయితే చాహల్ – మహ్వేష్ మీద ప్రత్యేకంగా కథనాలను కూడా ప్రసారం చేసింది. అయితే వీటిని అటు చాహల్, ఇటు మహ్వేష్ ఖండించలేదు. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.
Also Read: తండ్రితో సంతోషాన్ని పంచుకున్న విరాట్ కోహ్లీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..
మహ్వేష్ స్పందించింది
చాహల్ తో డేటింగ్ పై తొలిసారిగా మహ్వేష్ స్పందించింది.. అయితే ఆమె నేరుగా విలేకరులతో మాట్లాడకుండా.. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది..” నేను ఎంతో కష్టపడ్డాను. ఇక్కడ దాకా రావడానికి సుదీర్ఘ ప్రయాణం చేశాను. ఈ ప్రయాణాన్ని మహ్వేష్ గా నేను ఆస్వాదిస్తున్నాను. నేను సాధించిన విజయాల పట్ల గర్వాన్ని వ్యక్తం చేస్తున్నాను. నాకు ప్రతి సందర్భంలో కావాల్సింది కూడా గర్వమే. నేను ఎలాంటి తప్పు చేయకుండా ఉంటాను. అనవసరమైన విషయాలను పట్టించుకోను. నా పని నేను మాత్రమే చేస్తాను. అలా చేసుకుంటూ ముందుకు సాగుతుంటాను.. ఇందులో ఎవరెవరో ఏదో అనుకుంటే.. వాటన్నింటికీ నేను సమాధానాలు చెప్పలేను. అందువల్లే ఎవరి పని వారు చేసుకుంటూ పోతే బాగుంటుందని” మహ్వేష్ తను చేసిన సోషల్ మీడియా పోస్టులో ప్రస్తావించింది.. చాహల్ తో కనిపించిన తర్వాత మహ్వేష్ గురించి రకరకాల కథనాలు బయటికి వచ్చాయి. ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారిగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అంతేకాదు తన జీవితం తన ఇష్టమని.. ఇందులో మిగతావారు ప్రవేశించాల్సిన అవసరం లేదని మహ్వేష్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఎవరి పని వారు చేసుకోవాలి అని చెప్పడం ద్వారా.. తన గురించి మరింత లోతుగా వెతకొద్దని ఆమె హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆర్జే మహ్వేష్ గురించి బాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఫ్రాంక్ వీడియో ద్వారా ఆమె విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. పైగా ఆమె అద్భుతంగా హిందీ మాట్లాడతారు.. అందువల్లే ఆమెకు విపరీతమైన పేరు వచ్చింది. చాహల్ ధనశ్రీ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆర్జే మహ్వేష్ కు దగ్గరయ్యాడని తెలుస్తోంది.