Superstar Rajinikanth: ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటిస్తున్న ‘కూలీ'(Coolie Movie). లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఆగస్టు 14 న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదే రోజున ఎన్టీఆర్(Junior NTR), హ్రితిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2′(War 2 Movie) చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే కచ్చితంగా రెండు సినిమాలకు నష్టం చేకూరుతుంది. కానీ కూలీ మేకర్స్ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తుండడాన్ని గమనించి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ టీం కి ఒక హెచ్చరిక జారీ చేశాడట. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలి కానీ, మొండిగా ముందుకు పోకూడదు.
వార్ 2 మూవీ టీం తో మాట్లాడి వాళ్ళు ఒకవేళ ఆరోజున రాకపోతేనే మన సినిమా విడుదల తేదీని లాక్ చేయండి, లేకపోతే వేరే తేదీని చూసుకుందాం అంటూ చెప్పుకొచ్చాడట. రెండు సినిమాల మేకర్స్ కూడా ప్రస్తుతం చర్చలు జరుపుకోవడానికి సిద్దంగానే ఉన్నారట. చూడాలి మరి ఏ సినిమా ఆగస్టు 14 న విడుదల అవుతుంది అనేది. ఇది ఇలా ఉండగా ఆగస్టు 14 న ‘వార్ 2 ‘ మూవీ విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అంతే కాకుండా రీసెంట్ గానే డ్యాన్స్ ప్రాక్టీస్ లో హీరో హ్రితిక్ రోషన్ కాళ్ళు దెబ్బ తిన్నాయి. దీంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆగష్టు 14 న ‘కూలీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే తేదీపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ మేకర్స్ కూడా కన్నేశారు.
ఇలా ఈ ఒక్క డేట్ పై అనేక ప్రతిష్టాత్మక చిత్రాల మేకర్స్ కన్ను పడింది. ఏది వస్తుంది అనేది విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్స్. అయితే కూలీ చిత్రం కేవలం రెండు కీలక సన్నివేశాల షూటింగ్, ఒక సాంగ్ చిత్రీకరణ తప్ప మొత్తం పూర్తి అయిపోయిందట. రజినీకాంత్ కూడా వచ్చే నెల నుండి ‘జైలర్ 2’ కి డేట్స్ ఇచ్చేసాడు. కాబట్టి ‘కూలీ’ ఆగస్టు 14 న విడుదల అవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు. విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉగాదికి అధికారికంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున , ఉపేంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా పూజ హెగ్డే ఒక ఐటెం సాంగ్ లో మెరవనుంది.