https://oktelugu.com/

Riyan Parag: అనన్య పాండే, సారా అలీఖాన్ తో సీక్రెట్ రిలేషన్ బయటపెట్టి షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్

గత ఏడాది రియాన్ పరాగ్ చుట్టూ సోషల్ మీడియా తిరిగింది. మైదానంలో అతడు చేసిన ఓవర్ యాక్షనే ఇందుకు కారణం. ఈసారి మాత్రం అతడు తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. మైదానంలో బుద్ధిమంతుడు లాగా మారిపోయాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 29, 2024 / 08:04 AM IST

    Riyan Parag

    Follow us on

    Riyan Parag: గత ఐపీఎల్ సీజన్ లో విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. క్యాచ్ పట్టినా, సిక్స్ కొట్టినా, ఫోర్ బాదినా.. రకరకాలుగా మైదానంలో విన్యాసాలు చేసేవాడు.. రాజస్థాన్ జట్టు తరుపున ఆడిన ఆటగాడు ఓవరాక్షన్ స్టార్ గా పేరుపొందాడు. దీంతో గత సీజన్ మొత్తం సోషల్ మీడియా అతడి చుట్టే చక్కర్లు కొట్టింది.. ఈ సీజన్లో మాత్రం అతడు తన ఆట తీరు మార్చుకున్నాడు. రాజస్థాన్ జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కీలకమైన ప్లే ఆఫ్ దశలో విఫలమైనప్పటికీ.. రాజస్థాన్ జట్టు అక్కడిదాకా ప్రయాణ సాగించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో నానుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.

    గత ఏడాది రియాన్ పరాగ్ చుట్టూ సోషల్ మీడియా తిరిగింది. మైదానంలో అతడు చేసిన ఓవర్ యాక్షనే ఇందుకు కారణం. ఈసారి మాత్రం అతడు తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. మైదానంలో బుద్ధిమంతుడు లాగా మారిపోయాడు. బ్యాటింగ్ లో సరికొత్త అవతారం ప్రదర్శించాడు. ఫీల్డింగ్ లో చురుకుగా కదిలాడు. దీంతో సోషల్ మీడియా అతడిని పట్టించుకోవడం మానేసింది. మీడియా అతడు ఆడినప్పుడు మాత్రమే లెక్కలోకి తీసుకుంది. దీంతో అతడికి గుర్తింపు పిచ్చి పట్టుకుంది. దీంతో అతడు బ్రౌజింగ్ హిస్టరీ తో ఒక్కసారిగా సంచలనంగా మారిపోయాడు. గత నాలుగు రోజుల నుంచి అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో టాప్ ట్రెండింగ్ పర్సనాలిటీగా గుర్తింపు పొందాడు.

    కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ తేలిపోయాడు. పది బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. టోర్నీ నుంచి రాజస్థాన్ జట్టు నిష్క్రమించడంతో.. రియాన్ తన సాధన జీవితాన్ని ప్రారంభించాడు.. ఈ క్రమంలో అన్ లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ లో రియాన్ పరాగ్ పాల్గొన్నాడు. అయితే ఇది అతడిని ఇబ్బందుల్లో పెట్టింది.. ఆ స్ట్రీమింగ్ సందర్భంగా తను వాడుతున్న యూట్యూబ్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో అతడి యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ చూసి ప్రేక్షకులు నోళ్లు వెళ్లబెట్టారు.. స్టార్ హీరోయిన్ల హాట్ వీడియోలను అతడు వెతకడం ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. అనన్య, సారా అలీ ఖాన్ హాట్ అంటూ అతని వెతికిన హిస్టరీ మొత్తం అందులో కనిపించింది. ఆ ఇద్దరి తర్వాత విరాట్ కోహ్లీ గురించి అతడు తీవ్రంగా శోధించినట్టు కల్పించింది. సెర్చ్ హిస్టరీని హైడ్ చేయకపోవడం పట్ల రియాన్ పరాగ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి..” మరీ ఇంత సొల్లు గాడివా” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.