https://oktelugu.com/

Rinku Singh: స్టార్క్ కు 25 కోట్లు ఇచ్చారు.. ఏళ్ల నుంచి ఆడితే నీకు 55 లక్షలేనా?.. రింకూ సింగ్ ఏమన్నాడంటే..

రింకూ సింగ్ ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోవచ్చు గాని.. గత మ్యాచ్లలో అతడు ఒంటి చేత్తో కోల్ కతా జట్టుకు విజయాలు అందించాడు.. అద్భుతమైన బ్యాటింగ్, ఆకట్టుకునే ఫీల్డింగ్ తో అలరించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 29, 2024 / 08:00 AM IST

    Rinku Singh

    Follow us on

    Rinku Singh: ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా కోల్ కతా నిలిచింది. ఫైనల్ పోరులో హైదరాబాద్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. మూడవసారి ఐపీఎల్ కప్ చేజిక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్, షారుక్ ఖాన్, ఇతర ఆటగాళ్లు ఆ ఆనందం నుంచి ఇంకా బయటపడటం లేదు. కేకేఆర్ కప్ గెలిచిన తర్వాత.. ఆ ఆనందాన్ని ఎక్కువగా ఆస్వాదించింది రింకూ సింగ్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. కప్ గెలిచిన వెంటనే తోటి ఆటగాళ్లను ఆలింగనం చేసుకున్నాడు. కేరింతలు కొట్టాడు. ఈలలు వేస్తూ మైదానంలో గోల గోల చేశాడు. కప్ సాధించామని ట్రోఫీకి పెద్దపెట్టున ముద్దులు పెట్టాడు..

    రింకూ సింగ్ ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోవచ్చు గాని.. గత మ్యాచ్లలో అతడు ఒంటి చేత్తో కోల్ కతా జట్టుకు విజయాలు అందించాడు.. అద్భుతమైన బ్యాటింగ్, ఆకట్టుకునే ఫీల్డింగ్ తో అలరించాడు. అంతటి కీలక ఆటగాడైనప్పటికీ..కోల్ కతా ఇచ్చే పారితోషికం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సీజన్లో కోల్ కతా తరఫున ఆడిన రింకూ సింగ్ కు ఆ జట్టు యాజమాన్యం ఇచ్చింది 55 లక్షలు మాత్రమే. గత కొన్ని సీజన్లలో కోల్ కతా జట్టు విజయాలలో రింకూ సింగ్ తిరుగులేని ప్రతిభను చూపుతున్నాడు. ఫినిషర్ గా ఎన్నో మ్యాచ్లలో కోల్ కతా కు విజయాలు అందించాడు.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. దుమ్మురేపాడు. అయినప్పటికీ అతడికి తక్కువ పారితోషికం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.. ఇదే సమయంలో కోల్ కతా జట్టు మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ను 25 కోట్లు పోసి కొనుక్కుంది. ఈ క్రమంలో రింకూ సింగ్ – స్టార్క్ రెమ్యూనరేషన్ మధ్య తీవ్రమైన చర్చ నడిచింది. అయితే తాజాగా ఈ విషయంపై రింకూ సింగ్ స్పందించాడు. ” నాకు 55 లక్షల రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ. క్రికెట్లో ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదని” రింకూ పేర్కొన్నాడు.

    రింకూ సింగ్ ది పేద కుటుంబం. అతడు చిన్నప్పుడు ఐదు రూపాయల కోసం పనిచేశాడు. ఆర్థికంగా స్థిరత్వం సాధించిన కుటుంబం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఏకంగా 55 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ సంపాదనలోనే అతడు ఆనందం వెతుక్కుంటున్నాడు. “దేవుడు నాకు చాలా ఇచ్చాడు. డబ్బులు ఎన్ని వస్తాయనే లెక్కలు వేసుకునే వ్యక్తిత్వాన్ని అది కాదు. ఉన్న దాంతోనే తృప్తిగా బతకడం అనేది నాకు చాలా ఇష్టం. నా సంపాదన పట్ల నేను సంతోషంగానే ఉన్నా.. ఒకప్పుడు పైసలు లేక చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు విలువ నాకు బాగా తెలుసు. వచ్చినప్పుడు ఏదీ తీసుకురాలేదు. వెళ్తున్నప్పుడు ఏదీ పట్టుకు పోలేమని”వేదాంత ధోరణిలో రింకూ సింగ్ మాట్లాడాడు.. అతడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.