https://oktelugu.com/

Balakrishna: కవల పిల్లలం.. హీరో విశ్వక్ సేన్ కు అందరి ముందే షాక్ ఇచ్చిన బాలయ్య…

బాలయ్య బాబు మేమిద్దరం కవలల్లా ఉంటాం అంటూ మాట్లాడడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక విశ్వక్ సేన్ తన ఫస్ట్ సినిమా నుంచి కూడా తన ఆటిట్యూడ్ ను చూపిస్తూ వస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 29, 2024 / 08:16 AM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నందమూరి బాలయ్య ఇక ఈయన ఒకప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అదే ఊపుతో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాల్ని అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే సీనియర్ హీరోలేవరికీ సాధ్యం కానీ రీతిలో విజయాలను అందుకొని హ్యాట్రిక్ హిట్స్ ను కూడా నమోదు చేశాడు.

    ఇక ఇదిలా ఉంటే ఇవాళ్ళ బాలయ్య బాబు యంగ్ హీరో అయిన విశ్వక్ సేన్ హీరోగా చేసిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇక ఈ సినిమా ఈనెల 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా బాలయ్య బాబు వచ్చి సందడి చేశాడు.

    ఇక ఆయన మాట్లాడుతూ విశ్వక్ సేన్ నేను ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టక పోయిన కూడా మేము కవల పిల్లల్లా ఉంటాము అంటూ ఆయన మాట్లాడిన మాటలు విశ్వల్ సేన్ అభిమానులను ఆనంద పరిచయానే చెప్పాలి. ఇక బాలయ్య బాబు ఇంతకు ముందు విశ్వక్ సేన్ చేసిన మరొక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరవ్వడం మనం చూశాం..ఇక ఇప్పుడు ఈ సినిమా ఈవెంట్ కి రావడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. బాలయ్య ఎంత అగ్రసివ్ గా ఉంటాడో, విశ్వక్ సేన్ కూడా అంతే అగ్రేసివ్ గా ఉంటాడు.

    కాబట్టి బాలయ్య బాబు మేమిద్దరం కవలల్లా ఉంటాం అంటూ మాట్లాడడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక విశ్వక్ సేన్ తన ఫస్ట్ సినిమా నుంచి కూడా తన ఆటిట్యూడ్ ను చూపిస్తూ వస్తున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా అతను చేసిన నటన ప్రేక్షకులకు విపరీతమైన ఆనందాన్ని కలిగించడమే కాకుండా తనకు సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసిందనే చెప్పాలి…