Riyan paraag : ఐపీఎల్ (IPL)లో తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) సన్ రైజర్స్ హైదరాబాద్(sun risers Hyderabad) చేతిలో ఓటమి పాలైంది. 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్లో కోల్ కతా తో తలపడిన రాజస్థాన్ రాయల్స్.. ఆ మ్యాచ్లో కూడా ఓడిపోయింది.. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయి.. అత్యంత దారుణంగా కోల్ కతా ముందు తలవంచింది. దీంతో రాజస్థాన్ జట్టుపై విమర్శలు మొదలయ్యాయి. వరుసగా రెండు ఓటములు ఎదురు కావడంతో రాజస్థాన్ జట్టుపై అభిమానులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే రాజస్థాన్ జట్టు పై మీమర్స్ మీమ్స్ పుంఖాను పుంఖాలుగా పోస్ట్ చేయడం ప్రారంభించారు. మొత్తంగా రాజస్థాన్ జట్టు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ దశలో ఆ జట్టు సాధించిన విజయం ఐపీఎల్ లో సంచలనంగా మారింది.
Also Read : ఏమయ్యా రియాన్ పరాగ్.. ఇప్పటికైనా తెలిసిందా ఎంత తప్పు చేశావో?
నాడు ధోని చేతిలో ఒదిగి
రాజస్థాన్ రాయస్ జట్టుకు ప్రస్తుతం రియాన్ పరాగ్(Riyan paraag) నాయకత్వం వహిస్తున్నాడు.. గత సీజన్లో రాజస్థాన్ జట్టుకు సంజు శాంసన్ నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కాని రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. అయితే రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) పై విజయం సాధించింది. గౌహతిలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లు లాస్ అయి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా(81) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత 183 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన చెన్నై జట్టు ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై జట్టులో కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్(Rituraj Gaikwad)(63) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ జట్టులో హసరంగ నాలుగు వికెట్లు తీశాడు.. అయితే రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ జట్టుకు ఇదే తొలి గెలుపు.. అయితే అతడికి మహేంద్ర సింగ్ ధోని అభిమాన క్రికెటర్ కావడం విశేషం. ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై జట్టును పరాగ్ ఓడించడం గమనార్హం. నేపథ్యంలో ధోనితో రియాన్ పరాగ్ చిన్నప్పుడు దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది..” అభిమాన ఆటగాడితో కలిసి.. ఆరాధ్య ప్లేయర్ తో పోటీపడి సొంత జట్టును గెలిపించుకోవడంలో ఆనందం మామూలుగా ఉండదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ధోనిని చూసి స్ఫూర్తి పొందిన వారిలో చాలామంది ఉన్నారని.. రియాన్ పరాగ్ కూడా అందులో ఒకరని.. అందువల్లే అతడు చెన్నై జట్టును ఓడించాడని.. ఇది ధోని నాయకత్వ స్ఫూర్తికి నిదర్శనంగా ఉందని నెటిజన్లు వివరిస్తున్నారు.
Also Read : వాళ్ల వీడియోల కోసం నేను వెతకలేదు. చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు: క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు