https://oktelugu.com/

Shokat Ali Khan : ఇంద్ర’ చిత్రంలో ‘షోకాత్ అలీ ఖాన్’ గుర్తున్నాడా..? ఇతని కొడుకు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద స్టార్ హీరో..ఎవరో గుర్తుపట్టగలరా!

'షోకాత్ అలీ ఖాన్' పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇంద్ర సేనా రెడ్డి కోసం ఏమైనా చేసే పాత్ర ఇది, చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఈ పాత్ర పోషించిన నటుడి పేరు పునీత్ ఇస్సార్. అమితాబ్ బచ్చన్ హీరో గా నటించిన 'కూలీ' అనే చిత్రం ద్వారా విలన్ గా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. 1983 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పునీత్ ఇస్సార్ కి మంచి పేరొచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 05:20 PM IST

    Shokat Ali Khan

    Follow us on

    Shokat Ali Khan : మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మైలురాయి వంటి చిత్రాలు చాలా ఉన్నాయి, అవి ఆయన కెరీర్ ని మలుపు తిప్పి మరో లెవెల్ కి తీసుకెళ్లాయి, అలాంటి సినిమాలలో ఒకటి ‘ఇంద్ర’. ఈ చిత్రం ఆరోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ ని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు చెప్పండి. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఆరోజుల్లోనే 28 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా 32 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైంది. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది. మధ్యలో కొన్ని సినిమాలు ఈ రికార్డుని ఎలా అయినా కొట్టాలనే అత్యుత్సాహంతో బలవంతంగా ఆడించారు కానీ, నిజాయితీగా 175 రోజులు ఆడింది మాత్రం ఇంద్ర సినిమానే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లోని క్యారెక్టర్స్ ని కూడా అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

    ముఖ్యంగా ‘షోకాత్ అలీ ఖాన్’ పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇంద్ర సేనా రెడ్డి కోసం ఏమైనా చేసే పాత్ర ఇది, చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఈ పాత్ర పోషించిన నటుడి పేరు పునీత్ ఇస్సార్. అమితాబ్ బచ్చన్ హీరో గా నటించిన ‘కూలీ’ అనే చిత్రం ద్వారా విలన్ గా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. 1983 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పునీత్ ఇస్సార్ కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆయనకీ వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం ‘మహాభారత్’ సీరియల్ అని చెప్పొచ్చు. ఇందులో దుర్యోధనుడిగా పునీత్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సీరియల్ తోనే ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అలా 250 కి పైగా సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన ఈయన, తెలుగు లో ఇంద్రతో పాటు మాస్టర్, ఠాగూర్, నరసింహుడు, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. 2022 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన, ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చాడు.

    Shokat Ali Khan son Puneet Issar

    ఇదంతా పక్కన పెడితే ఈయనకి సిద్దాంత్ ఇస్సార్ అనే కొడుకు ఉన్నాడు. ఇతను కూడా బాలీవుడ్ లో హీరో గా అడుగుపెట్టాడు. చూసేందుకు అక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని అందం, ఫిజిక్ ఈ కుర్రాడి సొంతం. ఈయన బాలీవుడ్ లో లాస్ట్ డీల్, ఛాయస్ ఈజ్ యువర్స్, భానుమతి వంటి చిత్రాల్లో హీరో గా నటించాడు. అలాగే పలు టీవీ సీరియల్స్ కూడా చేసాడు. కానీ ఎందుకో కానీ తండ్రి లాగా సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. కనీసం ఈ సినిమాతో అయినా ఈయనకి మంచి గుర్తింపు వస్తుందో లేదో చూడాలి.