https://oktelugu.com/

Ind Vs Aus 5th Test: శరీరాన్నే ఫణంగా పెట్టి పోరాడిన పంత్.. ఇప్పటికీ రెండు సార్లు పెద్ద గాయాలు

గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు విఫలమవుతున్నారు. నిలబడాల్సిన మ్యాచ్ లో వరుసగా చేతులెత్తేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ఎదుట దాసోహం అవుతున్నారు. కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయకుండా విఫలమవుతున్నారు. సిడ్ని టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనూ అదే జరుగుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 3, 2025 / 11:00 AM IST
    Follow us on

    Ind Vs Aus 5th Test: టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ భవితవ్యాన్ని నిర్ణయించే సిడ్నీ టెస్టులో టీమ్ ఇండియా ఆటగాళ్లు విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్.. వెంట వెంటనే అవుట్ కావడంతో టీమిండియా వంద పరుగుల లోపే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. పూడ్చలేని నష్టంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆచి తూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను కాస్తలో కాస్త అడ్డుకోగలుగుతున్నారు. వేగంగా దూసుకు వచ్చే బంతులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 48 పరుగులు జోడించారు. 40 పరుగులు చేసిన రిషబ్ పంత్ చివరికి బోలాండ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. ఇందులో రిషబ్ పంత్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టు స్కోరు 72/4 వద్ద ఉన్నప్పుడు మైదానంలోకి వచ్చిన రిషబ్ పంత్.. నిదానంగా ఆడాడు. ఆచితూచి పరుగులు తీశాడు. ఆఫ్ స్టంప్ బంతులను వదిలేశాడు. అయితే 40 పరుగులు చేసి జోరు మీద ఉన్న రిషబ్ పంత్ బోలాండ్ బౌలింగ్ లో కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 120 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది .

    గాయాలను తట్టుకొని

    కొంతకాలంగా స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడటంలో పంత్ విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో అతడు సిడ్ని టెస్టులో ధైర్యంగా నిలబడ్డాడు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లు వేసిన బంతులు దూసుకు రావడంతో అతడు గాయపడ్డాడు. ముఖ్యంగా స్టార్క్ వేసిన బౌన్సర్ అతడి చేతి భాగానికి గట్టిగా తగిలింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం వాచిపోయింది. ఇక బోలాండ్ వేసిన బంతి రిషబ్ పంత్ శరీరాన్ని గట్టిగా తగిలింది. స్టార్క్ వేసిన బంతి పంత్ హెల్మెట్ దిశగా దూసుకు వచ్చింది. దానిని అతడు తప్పించుకునే క్రమంలో చేతికి తగిలింది. దీంతో స్టార్క్ పంత్ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. అతడికి గాయం ఏ స్థాయిలో అయిందో చూడ్డానికి దగ్గరగా వచ్చాడు. మరోవైపు జట్టు ఫిజియోలు రిషబ్ పంత్ కు చికిత్స అందించారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ విఫల ప్రదర్శన చేయడంతో టీమిండియా 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనవసరంగా ఆఫ్ స్టంప్ బంతిని ఆడి వికెట్ పడేసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా లెగ్ సైడ్ బంతిని ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక గిల్ కూడా నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కోల్పోయాడు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్న క్రమంలో అవుట్ అయ్యాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి డక్ అవుట్ అయ్యాడు. బోలాండ్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 120 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో వాషింగ్టన్ సుందర్ (0), రవీంద్ర జడేజా (15) క్రీజ్ లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, లయన్ చెరో వికెట్ సాధించారు.