Game Changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక వీళ్ళు చేసే సినిమాల మీద యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి అంచనాలైతే ఉంటున్నాయి… ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక పెను సంచలన రికార్డును సృష్టిస్తూ ముందుకు సాగుతుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన రాజమహేంద్రవరంలో ఈవెంట్ కండక్ట్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ చీఫ్ గెస్ట్ గా హాజరవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ ఈవెంట్ కి ఆయన రావడం అనేది ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి.
ఇక ఆయన డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ కి హాజరవ్వలేదు. కానీ ఈ సినిమా ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఆయన సన్నాహాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి అండగా పవన్ కళ్యాణ్ నిలవడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ రాకతో ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయి చేరుకుంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటికే ‘బాబాయి అబ్బాయి ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు’ అంటూ ఫ్యాన్స్ కొన్ని కామెంట్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి బూస్టప్ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఈనెల 10 వ తేదీన రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక దాంతో పాటుగా ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇండియాలో ఎవరికి వారు వాళ్ళ సినిమాలతో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్న నేపధ్యం లో రామ్ చరణ్ కూడా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…