Rishabh Pant After Accident: పళ్లు తోముకోవడానికి కూడా.. పాపం రిషబ్ పంత్ పరిస్థితి ఇలా తయారైందా?

Rishabh Pant After Accident: ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. వైద్య సిబ్బంది చేస్తున్న సహకారంతో త్వరలో ఫిట్ నెస్ సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రమాదం సమయంలో తీవ్రంగా గాయపడిన పంత్ వైద్య పరీక్షల సాయంతో గాయాల నుంచి రికవరీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన పళ్లు తానే తోముకుంటున్నాడు. ఘోర ప్రమాదం నుంచి బయటపడిన తరువాత అతడి రికవరీ కష్టమే అన్నారు. కానీ పట్టుదలతో అతడు గాయాల నుంచి మెల్లగా […]

Written By: Srinivas, Updated On : March 2, 2023 11:47 am
Follow us on

Rishabh Pant After Accident: ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. వైద్య సిబ్బంది చేస్తున్న సహకారంతో త్వరలో ఫిట్ నెస్ సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రమాదం సమయంలో తీవ్రంగా గాయపడిన పంత్ వైద్య పరీక్షల సాయంతో గాయాల నుంచి రికవరీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన పళ్లు తానే తోముకుంటున్నాడు. ఘోర ప్రమాదం నుంచి బయటపడిన తరువాత అతడి రికవరీ కష్టమే అన్నారు. కానీ పట్టుదలతో అతడు గాయాల నుంచి మెల్లగా కోలుకుంటున్నాడు. త్వరలో మళ్లీ జట్టులోకి చేరతానని చెబుతున్నాడు.

Rishabh Pant After Accident

ప్రమాదం నుంచి బయట పడ్డాక పంత్ కు అన్ని ప్రతికూలంగానే మారాయి. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ పంత్ కు జరిగిన ప్రమాదం అత్యంత ప్రమాదకరమైనది. అతడు కారులోంచి దూకకపోతే అందులోనే సజీవ దహనమైపోయేవాడు. అత్యంత చాకచక్యంగా అందులో నుంచి దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రమాదం నుంచి బయట పడ్డాక పంత్ లో పట్టుదల పెరిగింది. ఎలాగైనా తాను గాయాల నుంచి కోలుకోవాలని బలంగా కోరుకున్నాడు. అంతే వేగంగా రికవరీ అవుతున్నాడు.

Also Read: Sadist Husband: 13 ఏళ్లు ఇంట్లో నరకం చూసిన మహిళ కన్నీటి కథ..!

గాయాలు అయిన తరువాత అతడి ఆలోచన విధానం మారింది. ప్రతి రోజు జట్టు కోసం ఆడాలనే ఉద్దేశం పెరుగుతోంది. అందుకే వైద్యుల సహకారంతో వేగంగా తన గాయాలను మాన్పుకుంటున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించి త్వరలో జట్టులోకి అడుగు పెడతానని బలంగా నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలో తన పళ్లు తానే తోముకోవడం ఉత్సాహాన్ని ఇస్తోందని చెబుతున్నాడు. క్రికెట్ కు దూరమైనందుకే బాధపడుతున్నాడు. త్వరలో జట్టులోకి వస్తేనే మజా ఉంటుందని ఆశిస్తున్నాడు.

క్రికెట్ దూరం కావడం వెలితిగానే ఉంటుంది. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే పంత్ జట్టుకు దూరం కావడంతో లోటుగానే చెప్పొచ్చు. తిరిగి క్రికెట్ జట్టులోకి రావాలని తహతహలాడుతున్నాడు. భారత జట్టుకు, ఢిల్లీకి మద్దతు కొనసాగించాలని అభిమానులను కోరుతున్నాడు. తిరిగి జట్టులో చేరే వరకు తనకు మనశ్శాంతి లేదని అంటున్నాడు. జట్టు విజయంలో ప్రముఖ పాత్ర పోషిస్తే ఆ మజా వేరుగానే ఉంటుంది. దీనికి త్వరలో నా కోరిక తీరుతుందని బలంగా నమ్ముతున్నాడు.

Also Read: Pushpa 2- Akshay kumar: పుష్ప 2 లో అక్షయ్ కుమార్.. సుకుమార్ ట్విస్టులు మామూలుగా లేవుగా!