IPL 2022: క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ వచ్చేసింది. ఈ ఏడాది తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో జడేజా నేతృత్వంలో చెన్నై టీమ్ ఓటమి పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోరు కూడా మాజీ కెప్టెన్ ధోనీ పుణ్యమే.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఆటగాళ్లు భావించగా వాళ్ల అంచనాలు తప్పాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దీంతో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. టపాటపా వికెట్లు పడిపోవడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు. 38 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం కెప్టెన్ జడేజానే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Also Read: KCR: కేంద్రం వర్సెస్ రాష్ట్రం: ధాన్యం యుద్ధం.. వరి కొయ్యలకు బలయ్యేదెవరో..?
సాధారణంగా జడేజా ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా హిట్టింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్ చేసిన తీరు విమర్శల పాలైంది. దూకుడుగా ఆడాల్సిన సమయంలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. అతడి కారణంగా చెన్నై తక్కువ స్కోరు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరి బంతికి సిక్స్ సాధించడాన్ని పక్కన పెడితే మిగతా 27 బంతుల్లో రవీంద్ర జడేజా చేసింది 20 పరుగులే.

ఒకవేళ ధోనీతో సమానంగా జడేజా బ్యాటింగ్ చేసి ఉంటే చెన్నై టీమ్ 150 పరుగులన్నా చేసేదని.. అప్పుడు చెన్నై బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేవారని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే చెన్నై బౌలింగ్ కూడా బలహీనంగా కనిపించింది. దీపక్ చాహర్, మొయిన్ అలీ వంటి ఆటగాళ్లు దూరం కావడంతో చెన్నై జట్టును దెబ్బతీసింది. అటు బ్యాటింగ్‌లోనూ చెన్నై బ్యాటర్లు అతి జాగ్రత్తకు పోవడం కొంపముంచిందనే చెప్పాలి.
Also Read: RRR 2nd Day Collections: రెండో రోజూ విశ్వ ప్రభంజన విజృంభణే