https://oktelugu.com/

Rashi Khanna: స్టార్ డైరెక్టర్ ను అప్రోచ్ అయింది.. భారీ ఛాన్స్ పట్టింది

Rashi Khanna: బబ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది హీరోయిన్ ‘రాశీ ఖన్నా’. అందుకే, ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఛాన్స్ లు రాలేదు అని ఒక టాక్ ఉంది. అయితే, ఇక రాశీ ఖన్నా తన రూట్ మార్చాలని నిర్ణయం తీసుకుందని.. ట్రెండ్ కి తగ్గట్టు.. కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని రాశీ ఖన్నా ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అసలు తానూ మంచి గ్లామర్ బ్యూటీని అని, అలాగే […]

Written By:
  • Shiva
  • , Updated On : March 27, 2022 / 11:31 AM IST
    Follow us on

    Rashi Khanna: బబ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది హీరోయిన్ ‘రాశీ ఖన్నా’. అందుకే, ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఛాన్స్ లు రాలేదు అని ఒక టాక్ ఉంది. అయితే, ఇక రాశీ ఖన్నా తన రూట్ మార్చాలని నిర్ణయం తీసుకుందని.. ట్రెండ్ కి తగ్గట్టు.. కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని రాశీ ఖన్నా ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అసలు తానూ మంచి గ్లామర్ బ్యూటీని అని, అలాగే మంచి నటిని కూడా అని.. అయినా తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు అని రాశీ ఖన్నా బాగా ఫీల్ అవుతుందట.

    Rashi Khanna

    నిజమే రాశీ ఖన్నాలో హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా…ఇంకా చిన్నాచితకా సినిమాలకు మాత్రమే ఆమె పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆమె ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉందట. నిజానికి రాశీ ఖన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. మొదటి నుంచి ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న హీరోల సినిమాల్లో ఆమె నటించినా అవేవీ ఆమె కెరీర్ కు ప్లస్ కాలేదు.

    Also Read: RRR సినిమాపై ట్వీట్ చేసిన మంచు బ్రదర్స్.. ఏం సినిమా రా అయ్యా అంటూ..

    కనీసం, ఇక నుండైనా తను స్టార్ హీరోల మూవీస్ లో బిజీ కావాలని తెగ ఆరాట పడుతుంది రాశీ ఖన్నా . పైగా తనకు ఛాన్స్ లు ఇవ్వమని అడుగుతూ ‘నేను రష్మిక, పూజా ల కంటే బాగుంటాను కదా ?, వాళ్ళ కోసం రాసిన పాత్రలు నాకు ఇవ్వండి, నేను చేస్తాను’ అంటూ రాశీ ఖన్నా అందర్నీ రిక్వెస్ట్ చేస్తోందట. ఏది ఏమైనా రాశీ ఖన్నా బాధలో అర్థం ఉంది. ఆమె కంటే టాలెంట్ తక్కువ ఉన్న వారు కూడా టాప్ పొజిషన్ కి వెళ్తున్నారు.

    కానీ, రాశీ ఖన్నా మాత్రం ఇంకా ఛాన్స్ ల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే, ఆ వెతుక్కునే క్రమంలో రాశీ ఖన్నాకి ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ వంశీ పైడిపల్లి – తమిళ స్టార్ హీరో విజయ్ కలయికలో రానున్న పాన్ ఇండియా సినిమాలో ఒక సెకండ్ హీరోయిన్ పాత్ర ఉంది. కాగా మొదట ఈ పాత్ర కోసం కృతి శెట్టిని అనుకున్నారు.

    Rashi Khanna

    ఐతే, ఈ పాత్ర గురించి తెలుసుకున్న రాశీ ఖన్నా, ఆ పాత్రను నేను చేస్తాను అంటూ వంశీ పైడిపల్లిను అప్రోచ్ అయింది. ఇక వంశీ పైడిపల్లి కూడా ఆమెకు ఆ పాత్ర ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి రాశీ ఖన్నా ఛాన్స్ ల కోసం బాగానే ఆరాటపడుతుంది.

    Also Read:  చరణ్ బర్త్ డే స్పెషల్.. చెర్రీ ఎప్పటికీ ప్రత్యేకమే

    Tags