RCB VS PBKS : చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపు విరాట్ కోహ్లీ. అందు గురించే సాధారణంగా అతడిని ఎవరూ గెలవడానికి ప్రయత్నించారు. అంతటి ఆస్ట్రేలియా బౌలర్లు సైతం విరాట్ కోహ్లీని చూసి సైలెంట్ గా ఉంటారు. పొరపాటున గెలికారో.. ఇక ఏమాత్రం విరాట్ కోహ్లీ ఆగడు. శివతాండవం చేస్తుంటాడు. బ్యాట్ చేతపట్టి బంతులను విచక్షణా రహితంగా కొడుతుంటాడు. తనను గెలికిన వారికి చుక్కలు చూపిస్తుంటాడు.. అందువల్లే విరాట్ కోహ్లీని సాధారణంగా ఎవరూ గెలకడానికి ప్రయత్నించారు. అయితే ఆదివారం నాటి పంజాబ్ మ్యాచ్లో ఏం జరిగిందో తెలియదు.. విరాట్ కోహ్లీని ఎవరు ఏమన్నారో తెలియదు.. కానీ అతడు రెండు సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా పంజాబ్ జట్టు ఆటగాడు నేహల్ వదెరా రన్ అవుట్ అయినప్పుడు.. అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరిగా విరాట్ కోహ్లీ వివాదాస్పదంగా ప్రవర్తించాడు. అత్యంత అసభ్యకరమైన సంకేతాలు చేశాడు. దానిని మర్చిపోకముందే హాఫ్ సెంచరీ చేసి.. ఆ తర్వాత బెంగళూరు జట్టును గెలిపించి మరో వివాదానికి విరాట్ కోహ్లీ తెర లేపాడు.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన ఘనత..
ఇంతకీ ఏం చేశాడంటే
విరాట్ కోహ్లీ పంజాబ్ జట్టుపై 73 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచాడు. బెంగళూరు జట్టును ఏడు వికెట్ల తేడాతో గెలిపించిన తర్వాత.. మైదానంలో విరాట్ కోహ్లీ విచిత్రంగా డ్యాన్స్ చేశాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ ముందు చిత్ర విచిత్రమైన హావభావాలను ప్రదర్శించాడు. దీంతో అయ్యర్ రెస్పాండ్ కాక తప్పలేదు. వెంటనే విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. ఫలితంగా ఈ గొడవకు శుభం కార్డు వేశాడు. ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీని గెలక లేదు. క్రితం మ్యాచ్ కూడా బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. అప్పుడు బహుశా ఎవరైనా పంజాబ్ బౌలర్లు విరాట్ కోహ్లీని గెలికి ఉంటారు. అందువల్లే అతడు ఆదివారం నాటి మ్యాచ్లో వివాదాస్పదంగా ప్రవర్తించాడని.. దారుణమైన సంకేతాలు ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ ఇలా వ్యవహరించడాన్ని వారు తప్పుపడుతున్నారు. క్రికెట్లో ప్రొఫెషనలిజం ఉండాలని.. తోటి ఆటగాళ్లు గెలిపినంత మాత్రాన పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే విరాట్ కోహ్లీ హుందాతనం దెబ్బతింటుందని వ్యాఖ్యానిస్తున్నారు. “విరాట్ లాంటి ఆటగాళ్లను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానిస్తుంటారు.. అలాంటి ఆటగాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలి.. వారి వ్యక్తిత్వంతో గొప్పగా కనిపించాలి. అంతేతప్ప ఇలాంటి చేష్టలతో పరువు తీసుకోవద్దు. దీనివల్ల వారిపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. ఆ తర్వాత వారు ఆడే మ్యాచ్లు కూడా చూడాలనిపించదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఫీల్డర్ ఫోర్ వెళ్లకుండా బంతిని ఆపాడు.. తిక్క రేగిన కోహ్లీ ఏం చేశాడంటే..