Trivikram and Allu Arjun : యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. స్టార్ డమ్ ను సంపాదించుకోవడం లో స్టార్ హీరోలు సైతం విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తెలుగు సినిమా స్థాయిని విపరీతంగా పెంచేసింది. తద్వారా ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మన స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులలో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రస్తుతం అయిన అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. మరి ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా మైథాలాజికల్ మూవీగా తెరకెక్కబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒక యుగానికి మరొక యుగానికి మధ్య పార్లర్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని రన్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా జానర్ ఏంటో తెలుసా..?
మరి ఏది ఏమైనా కూడా డిఫరెంట్ అటెంప్ట్ చేయడంలో అల్లు అర్జున్ కొంతవరకు ముందుంటారనే చెప్పాలి. అందుకోసమే ఈ సినిమాని అతనితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ భావించినట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరి మధ్య మంచిర్యాపో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే.
ఇప్పటికే వీళ్ళు మూడు సినిమాలను చేసి ఆ మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. కాబట్టి వీళ్ళ కాంబోలో వస్తున్న నాలుగో సినిమాగా ఈ సినిమాకి మంచి గుర్తింపు అయితే ఉంది. మరి ఆ గుర్తింపును కాపాడుకోవడానికి వీళ్లిద్దరూ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి అల్లు అర్జున్ కి వినిపించారట.
ఆ కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మొన్నటిదాకా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే ఒక చిన్న డైలామా ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందని ఇద్దరు కన్ఫామ్ అయితే చేశారు. ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలోనే కొంతవరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి…
Also Read : చరిత్రలో కనుమరుగైన పురాణ కథతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ!