https://oktelugu.com/

RCB Vs DC IPL 2024: ఆర్సీబీ పడి లేచిన కెరటం.. అదే జరిగితే ఫైనల్ వెళ్లడం ఖాయం..

ఆదివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 47 పరుగుల భారీ వ్యత్యాసంతో విజయాన్ని అందుకుంది. విజయం ద్వారా బెంగళూరు తన రన్ రేట్ ను కూడా బలోపేతం చేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 13, 2024 11:23 am
    RCB Vs DC IPL 2024

    RCB Vs DC IPL 2024

    Follow us on

    RCB Vs DC IPL 2024: గాయపడిన బెబ్బులి నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందట. కేజీఎఫ్ లో ఈ డైలాగ్ గుర్తుంది కదా .. ఈ ఐపీఎల్లో దానిని నిజం చేసి చూపిస్తోంది బెంగళూరు జట్టు. ఐపీఎల్ మొదటి స్పెల్ లో వరుస ఓటములు ఎదుర్కొన్న బెంగళూరు.. రెండవ స్పెల్ లో అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. మొదటి స్పెల్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడి.. ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఆ తర్వాత స్పెల్ లో ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

    ఆదివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 47 పరుగుల భారీ వ్యత్యాసంతో విజయాన్ని అందుకుంది. విజయం ద్వారా బెంగళూరు తన రన్ రేట్ ను కూడా బలోపేతం చేసుకుంది. బెంగళూరు తన తర్వాతి మ్యాచ్ ను చెన్నై జట్టుతో ఆడుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో చెన్నై జట్టును 18 పరుగుల తేడాతో మట్టి కరిపించడం లేదా 18.1 ఓవర్లలో టార్గెట్ చేజ్ చేస్తే.. చెన్నై జట్టు కంటే మెరుగైన రన్ రేట్ సాధించి బెంగళూరు ప్లే ఆఫ్ కు దర్జాగా వెళ్తుంది. ఒకవేళ ఓడితే రెండవ మాటకు తావు లేకుండా ఇంటికి వస్తుంది.

    గత చరిత్ర ప్రకారం బెంగళూరు వరుసగా విజయాలు సాధించినప్పుడు ప్లే ఆఫ్ కు వెళ్ళిపోయింది. అంతేకాదు ఫైనల్ కూడా చేరింది. 2011లో బెంగళూరు వరుసగా ఏడు మ్యాచ్ లలో గెలిచింది. కానీ టైటిల్ వేటలో ఓడిపోయి, రన్నరప్ గా నిలిచింది.. 2009 సీజన్లను వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచింది. అప్పుడు కూడా ఫైనల్ వెళ్ళింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుత సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేసులో ఉంది. 2010, 2021 సీజన్లలో వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి, ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ఒకవేళ ఇదే సెంటిమెంట్ గనుక కొనసాగితే.. ఈసారి బెంగళూరు ఫైనల్ వెళ్తుందని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు.

    ఇక ఆదివారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లకు 187 రన్స్ చేసింది. రజత్ పాటిదార్ 32 బంతుల్లో 52, గ్రీన్ 24 బంతుల్లో 32, విల్ జాక్స్ 29 బంతుల్లో 41 రాణించారు. విరాట్ కోహ్లీ 13 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం 2, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. ఇశాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కులదీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.

    బెంగళూరు విధించిన టార్గెట్ చేదించేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టు19.1 ఓవర్లలో 140 రన్స్ స్కోర్ మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అక్షర్ పటేల్ 39 బాల్స్ లో 57, హోప్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. బెంగళూరు బౌలర్లలో యష్ దయాల్ 3 వికెట్లు పడగొట్టాడు. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయం ద్వారా బెంగళూరు పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టును వెనక్కి నెట్టింది. ఏకంగా ఐదవ స్థానానికి ఏక బాకింది. ఈ ఓటమితో ఢిల్లీ జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.