https://oktelugu.com/

RCB Vs CSK: అటు CSK, ఇటు RCB.. ఎవరూ తగ్గడం లేదుగా.. వీడియోలు చూస్తే రోమాలు నిక్కబొడావాల్సిందే..

బెంగళూరులో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. శనివారం కూడా వర్షం పడుతుందని.. మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడుతుందని వార్తలు వినిపించాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 18, 2024 / 05:37 PM IST

    RCB Vs CSK

    Follow us on

    RCB Vs CSK: ఎవరూ తగ్గడం లేదు. పసుపు పచ్చ జెర్సీలు వేసుకొని చెన్నై అభిమానులు సందడి చేస్తుంటే.. “ఈ సాలా కప్ నమదే” అంటూ బెంగళూరు అభిమానులు నినాదాలు చేస్తున్నారు. పోటాపోటీగా ప్రదర్శనలు.. కేరింతలు, అరుపులతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం జరిగే మ్యాచ్ ఫలితం పై రెండు జట్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో.. ఆటగాళ్లు మాత్రమే కాదు.. అభిమానులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ కంటే ముందు ఆటగాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు తమ వంతు అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

    బెంగళూరులో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. శనివారం కూడా వర్షం పడుతుందని.. మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడుతుందని వార్తలు వినిపించాయి. అయితే శనివారం ఆ ప్రాంతంలో వాతావరణం పొడిగా మారింది. ఆకాశం సాధారణంగా ఉంది. పర్వాలేదనే స్థాయిలో సూర్యుడు కనిపించాడు. దీంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దయితే.. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ జట్టుకు చెన్నైకి నెట్ రన్ రేట్ లో చాలా తేడా ఉంది. అందుకే వర్షం కురవద్దు అంటూ వరుణ దేవుడికి వేయి మొక్కులు మొక్కుతున్నారు. శనివారం బెంగళూరు నగరవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సాలా కప్ నమదే అంటూ నినాదాలు చేశారు.

    ఇక చెన్నై అభిమానులు పసుపుపచ్చరంగు జెర్సీలు వేసుకొని సందడి చేశారు. చెన్నైకి అనుకూలంగా నినాదాలు చేస్తూ మైదానాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. కొంతమంది ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలోని క్యాంటీన్ మొత్తం చెన్నై అభిమానులతో నిండిపోయింది. పసుపు రంగు జెర్సీ వేసుకోవడంతో, ఆ ప్రాంతం చెన్నై చేపాక్ స్టేడియాన్ని తలపించింది. సీఎస్కే అంటూ అభిమానులు చేసిన నినాదాలు ఉర్రూతలూగించాయి.

    ఇక కొంతమంది అభిమానులైతే తమ బుర్రకు పదును పెడుతూ సరికొత్తగా వీడియోలను రూపొందిస్తున్నారు. అటు చెన్నై, ఇటు బెంగళూరు జట్లకు కీలకమైన మ్యాచ్ కావడంతో పలు హిట్ సినిమాల్లోని సన్నివేశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేజీఎఫ్ -2 సినిమాలోని “ధీర ధీర” పాటలో యశ్ ముఖానికి బదులుగా విరాట్ కోహ్లీ చిత్రాన్ని జత చేసి అంచనాలు పెంచుతున్నారు. చెన్నై పై బెంగళూరు ను కోహ్లీ గెలిపిస్తాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు . ఈ వీడియో చూసేందుకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఇక చెన్నై అభిమానులు కూడా తమిళ సినిమాలలో కొన్ని దృశ్యాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మొత్తానికి అటు అభిమానులు తమ జట్ల కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రయాస పడుతున్నారు. మరి చివరికి ఏ జట్టు గెలుస్తుందో..