Homeక్రీడలుVirat Kohli: ఆర్సీబీ అట్టర్ ఫ్లాప్.. కోహ్లీ కెప్టెన్సీ పనైపోయిందా? పరుగులెందుకు చేయడం లేదు?

Virat Kohli: ఆర్సీబీ అట్టర్ ఫ్లాప్.. కోహ్లీ కెప్టెన్సీ పనైపోయిందా? పరుగులెందుకు చేయడం లేదు?

Virat Kohli: RCB Trolled Brutally After They Collapse Against KKR In IPL 2021

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏమైంది? ఆ పరుగుల యంత్రం ఎందుకు నత్తనడకన సాగుతోంది. పరుగులు చేయడానికి ఎందుకు తటపటాయిస్తోంది? సెంచరీల మీద సెంచరీలు చేసిన ఆ రన్ మిషన్ ఇప్పుడు ఎందుకు ఆపసోపాలు పడుతున్నారు. అటు టీమిండియా కెప్టెన్ గా.. ఇటు ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎందుకు విఫలమవుతున్నాడన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ ఫ్యాన్స్ సైతం తాజాగా ఐపీఎల్ లో ఆర్సీబీ దారుణ ఓటమిని జీర్ణించుకోవడం లేదు. కోహ్లీ కెప్టెన్సీ పని.. ఆటతీరు బాగాలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ విరాట్ కోహ్లీకి ఏమైంది? తెలుసుకుందాం..

ఇండియాలో జరిగిన ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. వరుస విజయాలు సాధించి టాప్ 2లో నిలిచింది. కోహ్లీ, మ్యాక్స్ వెల్, డివిలియర్స్, పడిక్కల్ దంచి కొట్టారు. జట్టును అగ్రపథాన నిలబెట్టారు. కానీ భారత్ నుంచి యూఏఈకి మారగానే ఆర్సీబీ పని అయిపోయింది. విరాట్ కోహ్లీ తేలిపోతున్నాడు. ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ ప్రత్యర్థి అయిన కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా కూడా 93 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక కోల్ కతా కేవలం 1 వికెట్ కోల్పోయి 10 ఓవర్లలోనే లక్ష్యాన్సి చేధించడం చూసి బెంగళూరు ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. టీం ఆటతీరుపై, కోహ్లీ కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

ముఖ్యంగా ఈ కీలకమైన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పట్టుమని 10 పరుగులు చేయలేకపోయాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక కెప్టెన్సీలో ఫీల్డింగ్ మార్పులు.. బౌలింగ్ లోనూ కోహ్లీ వ్యూహాలు పనిచేయలేదు. కేవలం 10 ఓవర్లలోనే కోల్ కతా దంచి కొట్టి గెలిచేయడం విశేషం.

ఇప్పటికే జట్టును నడిపించలేక.. పరుగులు చేయలేక సతమతవుతున్న విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇక ఐపీఎల్ లోనూ ఆర్సీబీకి ఇదే సీజన్ కెప్టెన్ గా లాస్ట్ అని చెప్పాడు. ఇప్పుడు తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ జట్టుకు భారంగా అయ్యాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కోహ్లీ ఓపెనర్ గా వెళ్లడం పిచ్చి నిర్ణయం అంటున్నారు. రెగ్యులర్ గా వచ్చే నంబర్ 3లోనే కోహ్లీ రావాలంటున్నారు.

కోహ్లీ పని అయిపోయిందని.. వెంటనే అతడు క్రికెట్ ను వదిలేయాలని క్రీడా నిపుణులు, మాజీలు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అవసరం అనుకుంటే ఆటగాడిగా కొనసాగడం బెటర్ అని సూచిస్తున్నారు. కోహ్లీ కెరీర్ ముగింపు దశకు వచ్చిందని అంటున్నారు. బాధ్యతగా కెప్టెన్సీ వదిలేసి కొత్త తరానికి పగ్గాలు ఇస్తే మంచిదంటున్నారు.

నిజానికి గొప్ప ఆటగాడు గొప్ప కెప్టెన్ కాలేడు. ఆ క్రికెట్ బుర్ర ఉన్నవారే కెప్టెన్ గా రాణించగలరు. బ్యాట్స్ మెన్ , కెప్టెన్ గా మంచి ఫాంలో ఉన్నంత వరకు ధోని పగ్గాలు చేపట్టాడు. తన పని అయిపోయిందని.. పరుగులు చేయడం కష్టంగా మారిన వేళ జట్టుకు భారం కాకూడదని వైదొలిగాడు. నాడు సూపర్ ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని స్వచ్ఛందంగా ధోనినే అందించాడు. కానీ కోహ్లీ మాత్రం కేవలం టీ20 కెప్టెన్సీ పదవికి మాత్రమే గుడ్ బై చెప్పి వన్డే, టెస్టు కెప్టెన్సీ తన వద్దే ఉంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆటతీరు చూస్తే అవి కూడా దక్కడం కష్టమేనన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా కోహ్లీ పగ్గాలు వదిలేసి ఆటతీరుపై దృష్టి సారిస్తే బెటర్ అని అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version