RCB Target 100+ Runs : హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన తర్వాత బెంగళూరు జట్టు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ దశలో గెలవాల్సిన మ్యాచ్లో.. లక్నోపై విజయం సాధించింది. తద్వారా దర్జాగా ప్లే ఆఫ్ లోకి వెళ్లిపోయింది. అయితే హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం ద్వారా బెంగళూరుకు టాప్ -2 లో రెండవ జట్టుగా స్థానం లభించింది. అయినప్పటికీ బెంగళూరు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా ఆ జట్టు ప్లేయర్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. ఇక బౌలర్లు అయితే ఆడుతోంది చిన్న స్వామి స్టేడియంలో అన్నట్టుగా బౌలింగ్ చేశారు. పిచ్ సహకరిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ లాంటి బంతులు వేసి పంజాబ్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. కేవలం 101 పరుగులకే పంజాబ్ ఆగిపోయేలా చేశారు. దీంతో తాము ఫైనల్ వెళ్లే అవకాశాలను మరింత పటిష్టం చేసుకున్నారు.
102 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరు ఫినిష్ చేసింది. సాల్ట్ పంజాబ్ బౌలర్ల బౌలింగ్ ను ఉప్పు పాతర వేశాడు. ఇక బౌలింగ్లో హేజిల్ ఉడ్, సుయాస్ శర్మ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో పంజాబ్ విధించిన 102 పరుగుల టార్గెట్ ను బెంగళూరు మరో 60 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. అయితే ఇలాంటి లక్ష్యాలను చేదించడం బెంగళూరుకు కొత్త కాదు. ఈ జాబితాలో ఆ జట్టు మీదే గతంలో అనితర సాధ్యమైన రికార్డు ఉంది. 2015లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 112 పరుగుల టార్గెట్ ను 9.4 లోనే చేదించింది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
Also Read : 9 సంవత్సరాల తర్వాత ఫైనల్ లోకి.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుదే.. ఎలాగంటే
2024లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు లక్నో విధించిన 166 పరుగుల టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.
2025లో అయ్యర్ సేనతో ముల్లాన్పూర్ మైదానంలో జరిగిన మ్యాచ్లో.. 102 పరుగుల టార్గెట్ ను బెంగళూరు 10 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.
2025 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోనే ఫినిష్ చేయడం విశేషం.
బెంగళూరు ఆటగాళ్లు క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో అద్భుతం చేశారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడుగడుగునా ఇబ్బంది కలిగించారు. బౌలింగ్లో దుమ్ము లేపారు. బ్యాటింగ్లో సత్తా చాటారు. ఫీల్డింగ్లో అయితే మెరుపులు మెరిపించారు. మొత్తంగా తొమ్మిది సంవత్సరాలు అనంతరం ఫైనల్ వెళ్లి.. ట్రోఫీ సాధించే క్రతువులో ఒక అడుగు దూరంలో ఉన్నారు.