Hari Hara Veeramallu producer : పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో నిర్మాత పడే టెన్షన్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యిందో లేదో చూసుకోవాలి, మరోపక్క పబ్లిసిటీ చూసుకోవాలి, ఇవి రెండు కాకుండా ప్రాంతాల వారీగా బిజినెస్ ని కూడా చూసుకోవాలి. వీటి అన్నిటిని తట్టుకొని నిలబడి స్మూత్ రిలీజ్ ని అందించాలి. ఎంతో మానసిక ఒత్తిడి తో కూడుకున్న పని. ఈ రంగం రెగ్యులర్ గా ఉండే నిర్మాతలకు పెద్ద టెన్షన్స్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్లకు బాగా అలవాటైన వ్యాపారం కాబట్టి. కానీ ఒకప్పుడు సినీ రంగం లో అగ్ర నిర్మాతగా కొనసాగి, ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమై వేరే వ్యాపారం లో బిజీ గా మారిన కొంతమంది సీనియర్ నిర్మాతలు రీ ఎంట్రీ ఇస్తూ ఒక పెద్ద హీరో సినిమా నిర్మించారంటే మాత్రం వాళ్లకు మెంటల్ టార్చర్ మామూలుగా ఉండదు అనే చెప్పాలి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramalliu Movie) నిర్మాత AM రత్నం(AM Ratnam) పరిస్థితి అదే. ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కష్టనష్టాలను అనుభవిస్తూ రత్నం ఎలాగో ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే నెల 12 న విడుదల చేయబోతున్నాడు. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. అన్ని ప్రాంతాల బయ్యర్స్ తో రత్నం రెగ్యులర్ గా వ్యాపారం గురించి చర్చలు జరుపుతూ ఉన్నాడు. సినిమా బాగా ఆలస్యం అవ్వడం తో రత్నం డిమాండ్ చేస్తున్నంత డబ్బులు ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు. దీంతో అడ్వాన్స్ బేసిస్ మీదనే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో విడుదల కాబోతుంది. ఇలా ఒకే సమయం లో ఇన్ని టెన్షన్స్ పెట్టుకోవడం తో హై బీపీ పెరిగి రత్నం కళ్ళు తిరిగి క్రింద పడిపోయినట్టు తెలుస్తుంది.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(MM Keeravani) సమక్ష్యం లో నడుస్తోంది. ఈరోజు ఉదయం 5 గంటలకు ఆఫీస్ కి వచ్చిన AM రత్నం సినిమా టెన్షన్ కారణంగా హై బీపీ కి గురై కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత వెంటనే ఆయన్ని ఆఫీసు పక్కనే ఉన్నటువంటు ఒమేగా హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు రత్నం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆయన హై బీపీ, హై ఫీవర్ తో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చారు. చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన AM రత్నం తిరిగి ఆఫీస్ కి వచ్చేసాడు. కానీ వైద్యులు పర్యవేక్షణ లో కచ్చితంగా ఉండాలని కోరడం తో ఆయనతో పాటు వైద్యులు కూడా వచ్చారు. ఈ చిత్రం కోసం ఆయన సుమారుగా 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడు. ప్రొమోషన్స్ తో ఈ సినిమా పై హైప్ తీసుకొని రావడం లో మూవీ టీం విఫలమైంది. కేవలం పవన్ కళ్యాణ్ మ్యాజిక్ మాత్రమే ఈ సినిమాని కాపాడాలి.