RCB : ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు అనూహ్యంగా ఓటమికి గురైంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో కనుక బెంగళూరు గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇప్పటికే టాప్ -2 అవకాశాన్ని దక్కించుకునేది. అయితే ఆ మ్యాచ్లో ఓటమి ద్వారా బెంగళూరు పరిస్థితి తారు మారైంది. ఈ నేపథ్యంలో మంగళవారం లక్నోతో జరిగే లీగ్ మ్యాచ్ బెంగళూరు టాప్ -2 భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్ లో కనుక బెంగళూరు గెలిస్తే కచ్చితంగా టాప్ -2 లోకి వెళ్తుంది. బెంగళూరు జట్టులోకి హేజిల్ వుడ్ రావడంతో బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతడు పర్పుల్ క్యాప్ విభాగంలో నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇక లక్నో జట్టు ఇటీవలి ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. మొత్తంగా ఈ సీజన్ లో చివరి మ్యాచ్ గెలిచి విజయంతో ముగించాలని లక్నో భావిస్తోంది.
Also Read : ఐపీఎల్ సాధించక ముందే.. బెంగళూరు జట్టు సరికొత్త రికార్డు..
అయితే బెంగళూరు లక్నోతో జరిగే మ్యాచ్ ను అంత సులువుగా వదిలే లాగా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే టాప్ -2 అవకాశం బెంగళూరుకు దక్కుతుంది. ఇప్పటికే ఈ జాబితాలో అయ్యర్ సేన టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. మిగతా జట్లకు ఆ అవకాశం ఉన్నప్పటికీ.. బెంగళూరు గెలిస్తే మాత్రం పాయింట్లు పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంటుంది. ఇప్పటికే ముంబై, గుజరాత్ ఓటములు ఎదుర్కొనే టాప్ -2 అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఇక గ్రూప్ దశలో మ్యాచ్ లు ఆడే అవకాశం వాటికి లేదు. ఎటొచ్చి బెంగళూరుకే టాప్ -2 వెళ్లడానికి అవకాశం ఉంది.. ఆ జట్టు లక్నోతో మంగళవారం జరగాల్సిన మ్యాచులు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బెంగళూరులో విరాట్ కోహ్లీ, సాల్ట్, రజత్ పాటిదార్, ధృవ్ జూరెల్, బెతెల్ వంటి వారితో బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. కృణాల్ పాండ్యా, హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వారితో బౌలింగ్ దళం కూడా బలంగానే ఉంది. మొత్తంగా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తేనే లక్నో పై విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. లక్న జట్టులో మిచెల్ మార్ష్, మార్క్రం, పూరన్ వంటి బ్యాటర్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఓరూర్కే, ఆయుష్ బదోని, ఆవేశ్ ఖాన్ వంటి బౌలర్లు కూడా భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అయితే వీరిని కాచుకొన్న దానినిబట్టే బెంగళూరు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. గత సీజన్లో బెంగళూరు వీరోచితమైన ఆట ఆడింది. ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయింది. కానీ ఓటమిపాలై నిరాశతో ఇంటికి తిరిగివచ్చింది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి.