Venkatesh : పెరుగుతున్న టెక్నాలజీ ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ ఈమధ్య కాలంలో అత్యంత ప్రతిభావంతులనైనా దర్శకులు, రచయితలు కూడా ఇవ్వడం లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా AI వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏది నిజం?, ఏది అబద్దం అనేది ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఆ రేంజ్ లో ఈ టెక్నాలజీ వృద్ధిలోకి వచ్చింది. రీసెంట్ గా సోషల్ మీడియా లో వైరల్ అయినా ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో వెంకటేష్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్, మరియు ఆమె చెల్లికి కలిపి ఒక కథ చెప్తాడు గుర్తుందా?..’నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఒక కల కనేవాడిని. నేను IAS పాస్ అయ్యి. వైజాగ్ కలెక్టరేట్ లో కలెక్టర్ చైర్ మీద కూర్చొని ఉన్నప్పుడు’ అంటూ సాగే ఫేమస్ డైలాగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
ఈ డైలాగ్స్ ని AI టెక్నాలజీ వాడి కథకు కొత్త రూపాన్ని ఇస్తూ ఒక వీడియో ని తయారు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఈ వీడియో ని తయారు చేసిన ఎడిటర్ క్రియేటివిటీ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు నెటిజెన్స్. ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ ఈమధ్య కాలం లో చాలానే వచ్చాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సన్నివేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు అనే విధంగా ఈ చిత్రం లోని సన్నివేశాలు ఉంటాయి. త్రివిక్రమ్ వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ అప్పట్లో ఒక సెన్సేషన్. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘మల్లీశ్వరి’.
Also Read : మరో యంగ్ హీరోయిన్ పై మనసు పడ్డ వెంకీ మామ! త్రివిక్రమ్ ఆమెను ఫిక్స్ చేశాడా?
ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. అలా ఈ రెండు చిత్రాల ద్వారా వచ్చిన క్రేజ్ తోనే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాడు. డైరెక్టర్ అయ్యాక వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ, ఎట్టకేలకు ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కాబోతుంది. ఈ చిత్రానికి ‘కుటుంబరావు’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వాసంత్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించబోతుంది. వచ్చే నెల 5వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. వాస్తవానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించి 8 ఏళ్ళు అయ్యింది. కానీ ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు బిజీ గా ఉండడంతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా కుదిరిందని అభిమానులు అంటున్నారు. చూడాలిమరి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్స్ క్రియేట్ చేస్తుంది అనేది.
AI టెక్నాలజీతో ఒక కట్టు కథకి రూపాన్నిచ్చారు #NuvvuNakuNachav pic.twitter.com/jPbxfmSu7O
— Rajesh Manne (@rajeshmanne1) May 26, 2025