spot_img
Homeక్రీడలుక్రికెట్‌RCB dominant performance: ప్రత్యర్థులకు ’భయాన్ని‘ టన్నుల్లో ఇస్తోన్న ‘ఆర్సీబీ’.. ఇంతలా ఎలా మారింది..

RCB dominant performance: ప్రత్యర్థులకు ’భయాన్ని‘ టన్నుల్లో ఇస్తోన్న ‘ఆర్సీబీ’.. ఇంతలా ఎలా మారింది..

RCB dominant performance: ఐపీఎల్ లో బెంగళూరు జట్టు దూసుకుపోతోంది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ.. నెంబర్ వన్ స్థానంలో ఉన్న పంజాబ్ కంటే అత్యంత స్థిరమైన పాజిటివ్ నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది.. బెంగళూరు జట్టు సోమవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో.. ఢిల్లీ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఒకానొక దశలో ఢిల్లీ జట్టును ఎనిమిది పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా బెంగళూరు చేసింది.. బెంగళూరు ఐపిఎల్ చరిత్రలోనే 49 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ రికార్డును ఢిల్లీ బద్దలు కొడుతుందా.. అనే అనుమానం అందరిలోనూ వ్యక్తం అయింది. చివరికి ఢిల్లీ జట్టు 76 పరుగులు చేసింది.. ఈ టార్గెట్ ను బెంగళూరు కేవలం 6.3 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన రన్ చేజ్ లో ఒకటి.

బెంగళూరు జట్టులో బ్యాటర్లు అదరగొడుతున్నారు. బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. ఫీల్డింగ్ లోనూ బెంగళూరు అత్యంత సమర్థవంతమైన పాత్రను పోషిస్తోంది.. అందువల్లే బెంగళూరు ఈ సీజన్లో కూడా సత్తా చూపిస్తోంది. గత సీజన్లో బెంగళూరు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ మీద అద్భుతమైన విజయం సాధించింది. ఈ సీజన్లో కూడా బెంగళూరు విజయాలను కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఎంత భారీ లక్ష్యమైనా సరే ఊది అవతల పడేస్తోంది.

విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, వంటివారు బ్యాటింగ్లో సంచలన ప్రదర్శన చేస్తున్నారు.. బౌలింగ్లో హెజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా వంటి వారు అదరగొడుతున్నారు. దీంతో బెంగళూరు జట్టుకు ఎదురు అనేది లేకుండా పోతుంది. ఈ సీజన్లో బెంగళూరు జట్టు ప్రత్యర్థులకు భయాన్ని టన్నుల్లో ఇస్తోంది. ఒకప్పుడు ఇలాంటి డామినేషన్ గేమ్ చెన్నై జట్టు ఆడేది. ముంబై జట్టు కూడా ఇలాంటి ఆట తీరును ప్రదర్శించేది. ఇప్పుడు ఆ రెండిటి స్థానాన్ని బెంగళూరు భర్తీ చేస్తోంది. ఇప్పుడు ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు ఖాయం. ఇదే జోరు గనుక కొనసాగిస్తే ఈసారి కూడా బెంగళూరు ట్రోఫీ అందుకోవడం కూడా కన్నడ అభిమానులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular