https://oktelugu.com/

Ravindra Jadeja: తన బౌలింగ్ సక్సెస్ సీక్రెట్ పై స్పందించిన రవీంద్ర జడేజా…

రవీంద్ర జడేజాని ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడుగుతూ మీరలా బౌలింగ్ చేయడానికి గల సీక్రెట్ ఏంటి అని అడిగినపుడు రవీంద్ర జడేజా స్పందిస్తూ సీక్రెట్ నేనెవరికీ చెప్పను ఎందుకంటే మీరు దాన్ని ఇంగ్లీషులో రాస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : October 21, 2023 / 03:10 PM IST

    Ravindra Jadeja

    Follow us on

    Ravindra Jadeja: ప్రపంచంలో ఉన్న అత్యుత్తమైన ఆల్ రౌండర్ లలో రవీంద్ర జడేజా ఒకరు. ఈయన ఇప్పటికే చాలా మ్యాచ్ ల్లో అద్భుతమైన బౌలింగ్ చేస్తూ అదే విధంగా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ టీమ్ లో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వరల్డ్ కప్ లో రాణిస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ కి చెమటలు పట్టిస్తున్నాడు. అలాగే ఈ వరల్డ్ కప్ లో ఆయన నాలుగు మ్యాచ్ ల్లో దాదాపు 131 డాట్ బాల్స్ వేశారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. నిజానికి ఈయన వేసిన బాల్స్ ని బ్యాట్స్ మెన్స్ ఎక్స్పెక్ట్ చేయడంలో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు.ఇక దాని వల్లే ప్రత్యర్థి టీమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ బౌలింగ్ వేస్తూ టీం కి ఎక్కువ వికెట్లు అందిస్తూ అపోజిషన్ టీం ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రతి బ్యాట్స్ మెన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్ ని ఎదుర్కోవడంలో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు.

    ఇంకా ఇలాంటి క్రమంలో ఈమధ్య రవీంద్ర జడేజాని ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడుగుతూ మీరలా బౌలింగ్ చేయడానికి గల సీక్రెట్ ఏంటి అని అడిగినపుడు రవీంద్ర జడేజా స్పందిస్తూ సీక్రెట్ నేనెవరికీ చెప్పను ఎందుకంటే మీరు దాన్ని ఇంగ్లీషులో రాస్తారు. దానివల్ల నా ప్రత్యర్థి దేశాల ప్లేయర్లు అది చదివి వాళ్ళు తెలుసుకొని నా సీక్రెట్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటారు. అందుకే నేను చెప్పను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఇక రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ ని సీనియర్ ఇండియన్ బౌలర్ అయిన మురళి కార్తిక్ ఎక్స్ ప్రెస్ చేస్తూ ఆయన ఇంతకుముందు రౌండ్ ఆర్మ్ బౌలింగ్ చేసేవాడు దానివల్ల బ్యాట్స్ మెన్స్ ఆ బాల్స్ ని ఎదుర్కొనేవారు మరి కొంతమంది ఆ బాల్స్ పైన ఎదురుదాడి చేసేవారు. అయితే ముఖ్యంగా ఈ రౌండ్ ఆర్మ్ బాల్స్ అనేవి ఎక్కువగా వేసేవాడు. కానీ అప్పుడున్న పిచ్ ని బట్టి ఆయన వేసే బాల్స్ కి అప్పుడు చాలా ఎక్స్ పెన్సివ్ బౌలర్ గా గుర్తింపు పొందాడు.

    కానీ ఇప్పుడు ఆయన రౌండ్ ఆర్మ్ బౌలింగ్ మానేసి నార్మల్ బాల్స్ వేస్తున్నాడు. దాంతో సీమ్ పై లాండ్ అవుతుంది. దానివల్ల అతను వేసే బాల్ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ మీద కట్టడి చేస్తుంది… అందువల్లే రవీంద్ర జడేజా ఈ మధ్య లో అద్భుతాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు అంటూ తన పైన తన ఆట తీరు పైన ప్రశంసలు కురిపించాడు.ఇక ఇలాంటి టైం లో జడేజా మన ఇండియన్ టీం లో ఉండటం కూడా ఇండియన్ టీం చేసుకున్న అదృష్టం అంటూ మురళి కార్తీక్ గురించి చెప్పడం గ్రేట్ అనే చెప్పాలి…