Ravichandran Ashwin- Sehwag : ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. సెహ్వాగ్ విధ్వంసం సృష్టించాడు.. పీడకలను పరిచయం చేశాడు.. నాటి రోజులను గుర్తు చేసుకున్న అశ్విన్..

రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా స్టార్ స్పిన్నర్ బౌలర్ గా సత్తా చాటుతున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో వికెట్లను పడగొడుతున్నాడు. ఇటీవలి చెన్నై టెస్టులో బంగ్లాదేశ్ పై సెంచరీ, ఆరు వికెట్లు పడగొట్టాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 26, 2024 8:06 pm

Ravichandran Ashwin- Sehwag

Follow us on

Ravichandran Ashwin- Sehwag : రవిచంద్రన్ అశ్విన్ టి20 క్రికెట్లో సత్తా చాటాడు. అనేక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో సచిన్ టెండూల్కర్, రాహు ద్రావిడ్, లక్ష్మణ్, ధోని, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్ళను ముప్పు తిప్పలు పెట్టాడు. వారికి ఊహించని బంతులు వేసి అవుట్ చేశాడు. కానీ సెహ్వాగ్ విషయంలో రవిచంద్రన్ అశ్విన్ పాచికలు పారలేదు. అతడు ఆఫ్ కట్, మిడ్ కట్ , అప్పర్ కట్ .. ఇలా ఎలాంటి బంతులు వేసినప్పటికీ సెహ్వాగ్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లు కొట్టి.. తన దూకుడు శైలిని నిరూపించుకున్నాడు. అంతేకాదు రవిచంద్రన్ అశ్విన్ కు పీడ కలలను పరిచయం చేశాడు.. దంబుల్లా వేదికగా జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే నాటి విషయాలను రవిచంద్రన్ ఓ యూట్యూబ్ తో అశ్విన్ పంచుకున్నాడు.

అవేవీ ఆలోచించను

తన బౌలింగ్లో సెహ్వాగ్ వీర విహారం చేయడంతో రవిచంద్రన్ అశ్విన్ మరుసటి రోజు.. అతడిని ప్రశ్నించాడు. ” నేను ఎలాంటి బంతులు వేసినా అలా ఎలా బ్యాటింగ్ చేయగలిగావ్? సచిన్, యువరాజ్, లక్ష్మణ్ లాంటి వాళ్లు ఔట్ అయ్యారు. మీరు మాత్రం ఇష్టానుసారంగా బ్యాటింగ్ చేశారు. బంతిమీద దీర్ఘకాలికంగా విరోధం ఉన్నట్టు బ్యాటింగ్ చేశారు. అది ఎలా సాధ్యమని సెహ్వాగ్ ను ప్రశ్నించానని” రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. అయితే అతడి ప్రశ్నలకు సెహ్వాగ్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ” మిగతా వాళ్లకు బంతి అంటే భయం. అది వికెట్లను పడగొడుతుందనే ఆందోళన. అవి రెండు నాలో ఉండవు. నేను బంతిని స్టాండ్స్ లోకి ఎలా పంపించాలా? అని మాత్రమే ఆలోచిస్తాను. బౌలర్ ఎవరనేది పట్టించుకోను. నా దృష్టి మొత్తం బలంగా బాదడం పైనే ఉంటుందని” సెహ్వాగ్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులిచ్చాడు. నాటి రోజులను ఓ యూట్యూబర్ తో రవిచంద్రన్ అశ్విన్ పంచుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. “అశ్విన్ భాయ్.. నువ్వు మాత్రమే కాదు సెహ్వాగ్ బాధితులు చాలానే ఉన్నారు. అతడికి భయం తెలియదు. బెరుకు తెలియదు. అలాంటి వాటిని అతడికి ఎవరూ పరిచయం చేయలేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.