https://oktelugu.com/

Pawan Kalyan Fans : మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అకిరా నందన్..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే చిత్రం లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో ఒక కీలక పాత్ర లో అకిరా నందన్ నటించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆయన పాత్ర ఒక 10 నిమిషాల వరకు సినిమాలో ఉంటుందట.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 10:02 PM IST

    Akira Nandan act in Chiranjeevi Movie

    Follow us on

    Pawan Kalyan Fans : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒకప్పుడు సినిమా ఒక్కటే తన వృత్తి, కేవలం సినిమాల మీద మాత్రమే ద్రుష్టి పెట్టేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యాడు, ఆంధ్ర ప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రి అయ్యాడు, 5 కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆయనకు రోజు ప్రభుత్వాధికారులతో రివ్యూ మీటింగ్స్, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు జనాలకు అందుతున్నాయా లేదా?, ఇలాంటి వాటి మీదనే ఎక్కువ ద్రుష్టి ఉంటుంది. క్షణం తీరిక కూడా ఉండదు. కాబట్టి తన తోటి స్టార్ హీరోలు లాగా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేయలేడు. కానీ అభిమానులు చేసుకున్న అదృష్టమో, ఏమిటో తెలియదు కానీ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ లాంటి చిత్రాలను ఎన్నికలలో ఆయన యాక్టీవ్ కాకముందే ప్రారంభించాడు.

    సగానికి పైగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాలు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున విడుదల కాబోతుండగా, ‘ఓజీ’ చిత్రం జూన్ నెలలో మొదలు కానుంది. ఇక ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తాడో లేదో తెలియదు, ఎందుకంటే వచ్చే ఎన్నికలలో ఆయన ముఖ్యమంత్రి కూడా అవ్వొచ్చు. ఒకవేళ సినిమాలు చేసిన ఎదో నెల రోజుల్లో పూర్తి అయ్యే రీమేక్ సినిమాలే చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు రాబోయే మూడు సినిమాల తర్వాత ఇక పవన్ కళ్యాణ్ సినీ నటుడు అనే విషయాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. కానీ అభిమానులు ఆయన తనయుడు అకిరా నందన్ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేణు దేశాయ్ కి కూడా అకిరా నందన్ హీరో అవ్వాలని కోరిక ఉంది కానీ, అకిరా కి అంతగా ఆసక్తి లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఆయనలో ఉంది. కానీ అభిమానులకు ఎదో ఒకరోజు అకిరా తన మనసు మార్చుకుంటాడు అనే నమ్మకం ఉంది. అభిమానుల నమ్మకాలు త్వరలోనే నిజం అవ్వబోతున్నాయని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

    అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో ఒక కీలక పాత్ర లో అకిరా నందన్ నటించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆయన పాత్ర ఒక 10 నిమిషాల వరకు సినిమాలో ఉంటుందట. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అతి త్వరలోనే మిగిలిన భాగానికి సంబంధించిన షూటింగ్ ని జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో అకిరా నందన్ కి సంబంధించిన సన్నివేశాలను తీస్తారని టాక్, దీని గురించి త్వరలోనే పూర్తి స్థాయి క్లారిటీ రాబోతుంది.