Ravichandran Ashwin: అశ్విన్ అరుదైన రికార్డు

ఎన్నో టెస్ట్ మ్యాచ్ లలో అద్భుతంగా బౌలింగ్ వేసి రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టును గెలిపించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మీద రవిచంద్రన్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది.

Written By: Suresh, Updated On : February 16, 2024 5:39 pm

Ravichandran Ashwin

Follow us on

Ravichandran Ashwin: టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.. ఇంగ్లాండ్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో జార్క్ క్రావ్ లే ను ఔట్ చేసి టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుమార్ పేరిట ఉండేది. అతడు టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు.. ఇప్పటివరకు అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా అనిల్ కుంబ్లే పేరుతో రికార్డు ఉంది. ఇక రవిచంద్రన్ అశ్విన్ 184 ఇన్నింగ్స్ ల్లో 500 వికెట్లు సాధించాడు. ఇందులో ఎనిమిది సార్లు పది వికెట్లు, 34 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

ఎన్నో టెస్ట్ మ్యాచ్ లలో అద్భుతంగా బౌలింగ్ వేసి రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టును గెలిపించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మీద రవిచంద్రన్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది.. అద్భుతమైన మణి మణికట్టు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగల నేర్పరితనం అతడి సొంతం. రెండవ టెస్ట్ విజయంలో రవిచంద్రన్ పాత్ర మరువలేనిది. కీలకమైన ఇంగ్లాండు బ్యాటర్లను తన స్పిన్ బౌలింగ్ తో పెవిలియన్ చేర్చాడు. దీంతో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. మైదానంపై ఉన్న ప్రేమను వినియోగించుకుంటూ బంతిని మెలికలు తిప్పగల సామర్థ్యం రవిచంద్రన్ అశ్విన్ సొంతం..

బౌలింగ్ మాత్రమే కాదు బ్యాటింగ్ లోనూ రవిచంద్రన్ సత్తా చూపించగలడు..రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ లోనూ బ్యాట్ తో రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. ఏకంగా 37 పరుగులు చేశాడు. ఈ టెస్ట్ తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధృవ్ అనే ఆటగాడితో ఎనిమిదవ వికెట్ కు 77 పరుగులు జోడించాడు. అయితే మిడిల్ పిచ్ పై పరుగులు తీయడంతో.. ఎంపైర్ రవిచంద్రన్ అశ్విన్ కు వార్నింగ్ ఇచ్చాడు. అతడి అనైతిక ఆట తీరు సరికాదంటూ అపరాధంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐదు పరుగులు ఇచ్చాడు. దీంతో ఎంపైర్ తో రవిచంద్రన్ వాగ్వాదానికి దిగాడు. ఇప్పుడు మాత్రమే కాదు రవిచంద్రన్ గతంలోనూ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్ తో మెరిశాడు. అపజయాల నుంచి విజయాల వైపు జట్టును నడిపించాడు. 500 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా మరిన్ని వికెట్లు తీసి భారత జట్టుకు విజయాలు అందించాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.