Homeక్రీడలుHaris Rauf: స్టార్ పేస్ బౌలర్ కు డబుల్ షాక్ లు.. క్రికెట్ బోర్డు కీలక...

Haris Rauf: స్టార్ పేస్ బౌలర్ కు డబుల్ షాక్ లు.. క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. కెరియర్ ముగిసినట్టేనా?

Haris Rauf: ఎంత ఆటగాడైనా క్రికెట్ బోర్డు ముందు దిగదుడుపే. కాదు కూడదు అని తల ఎగిరేస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్. ఇటీవల జరిగిన కొన్ని టోర్నీల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో.. బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

హరీస్ రౌఫ్.. పాకిస్తాన్ జట్టులో స్టార్ పేసర్. పదునైన బంతులు వేయడంలో దిట్ట. ఎటువంటి బ్యాటర్ నైనా ముప్పు తిప్పలు పెట్టగలడు. అందువల్లే జట్టులో చేరిన అనతి కాలంలోనే స్టార్ పేసర్ గా ఎదిగాడు. ఆట లో నైపుణ్యం పెరగడంతో.. ఇతడికి మిగతా అవ లక్షణాలు కూడా వంట పట్టాయి. దీంతో బోర్డుకు అతడికి మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో అతని స్పెషల్ కాంట్రాక్టర్ రద్దు, టీ_20 లీగ్ లలో పాల్గొనకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కట్టడి చేసింది. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ టోర్నీలో ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పలుమార్లు అతడిని కోరింది. అయినప్పటికీ అతడు దానికి విముఖత చూపాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హరీస్ రౌఫ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడు ఈ ఏడాది జూన్ దాకా టి20 లీగ్ లలో ఆడకూడదని నిర్ణయించింది. అతడి స్పెషల్ కాంట్రాక్ట్ ని కూడా రద్దు చేసింది.

పాకిస్తాన్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించింది. డిసెంబర్ నుంచి జనవరి వరకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో ఆడాలని, కనీసం రోజుల్లో 10 నుంచి 15 ఓవర్లైనా బౌలింగ్ వేయాలని పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ కోరింది. దీనికి అతడు ఒప్పుకోలేదు. పోవైపు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే.. అతడు దానిని పక్కనపెట్టి బిగ్ బాష్ లీగ్ లో ఆడాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.” అతడు టెస్ట్ సిరీస్ నుంచి తట్టుకునేందుకు గాయం లేదా ఇతర సరైన కారణం చూపలేదు. అందుకే అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నాం. అతడి గైర్హాజరికి గల కారణాలను విచారణ జరిపిస్తాం.” అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తానికి అతడి కాంట్రాక్టు రద్దు చేసిన పిసిబి.. 2024 జూన్ 30 దాకా ఎటువంటి విదేశీ క్రికెట్ లీగ్లలో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకొన్న నిర్ణయం పట్ల ఇంతవరకు హరీస్ రౌఫ్ స్పందించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల అతడి కెరియర్ ముగిసినట్టేనని నెటిజన్లు వ్యాఖ్యనిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version