Cricketer Photo Story: కృషి, పట్టుదల ఉంటే సినీ, క్రికెట్ రంగంలో తొందరగా రాణిస్తారు. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈ రంగాల్లో చాలా మంది సెలబ్రెటీలు అయ్యారు. ఇక క్రికెట్ విషయానికొస్తే చిన్నప్పటి నుంచి తమ ప్రతిభా శక్తి అలవరచ్చుకుంటే ఇంటర్నేషనల్లో రాణిస్తారు. మన దేశ క్రికెటర్లు నెంబర్ వన్ గా ఉన్న దేశాన్ని ఢీకొట్టి ముందుకు సాగుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ర్యాంకులో కాస్త వెనుక ఉన్నప్పటికీ గతంలో వరల్డ్ కప్ లు కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఓ ఇండియన్ టీమ్ కు చెందిన క్రికెటర్ దూసుకు పోతున్నాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఐపీఎల్ లో బార్డర్ల వైపు బాదాదు. అతనికి సంబంధించిన చైల్డ్ పిక్ అలరిస్తోంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
అల్ రౌండ్ క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. కుడి చేతి వాటం కలిగిన ఈయన బార్డర్ల వైపే బాదుతాడనే పేరుంది. ఈ ఏడాదిలో జూన్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో అశ్విన్ పేరు మారుమోగింది. 13 ఇన్నింగ్స్ లో 14 వికెట్లు పడగొట్టాడు కూడా. ఆ తరువాత వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 15 వికెట్లు తీసి అదరగొట్టాడు. మొత్తంగా అశ్విన్ కెరీర్లో 712 వికెట్లు పడగొట్టి టీం ఇండియా తరుపున బెస్ట్ స్పిన్నర్ అని అనిపించుకుంటున్న ఈయన తిరుగులేని ఆటగాడు అని అనిపించుకుంటున్నాడు.
చిన్నప్పటి నుంచే అశ్విన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ చదువుపై శ్రద్ధ ఉంచడం వల్ల ఖాళీ సమయాల్లో మాత్రమే క్రికెట్ ఆడేవారు. ఇలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మళ్లీ క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెట్టాడు. సీకే విజయ్, చంద్ర ప్రోత్సాహంతో క్రికెట్ లో రాణించాడు. అప్పటి నుంచి ఇండియిన్ టీంలో బెస్ట్ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బీసీసీఐ కాత్రక్ట్ లిస్ట్ లో 5 కోట్ల రూపాయలు పలికిన అశ్విన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భారీ పారితోషికం అందుకున్నాడు. దీంతో ఆయన ఆస్తి విలువ వంద కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.
2011 నవంబర్ 6న తొలి టెస్ట్ ఆడిన అశ్విన్ వెస్టీండీస్ వరకు 113 వన్డేల్లో 707 పరుగులు, 65 టీ20ల్లో 184 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 151, టీ 20ల్లో 72 వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ లో టాప్ ప్లేసులో కొనసాగుతున్న అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో 10 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. అత్యధిక స్కోరు 124తో 5 టెస్ట్ సెంచరీలు చేశాడు. 2011 ప్రపంచ క్రికెట్ కప్, 2013 ఐసీసీ చాంపియన్ ట్రోఫీలు గెలుచుకోవడంలో అశ్విన్ భాగస్వాముడయ్యాడు.