Kapil Dev: శనివారం బార్బడోస్‌లో ఇండియా vs వెస్టిండీస్ మధ్య జరిగిన రెండవ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఎవరు ఊహించని విధంగా తొలుత బాటింగ్ చేసిన భారత్ పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. ఈ మ్యాచ్లో టీమ్ మెయిన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మూడవ మ్యాచ్ కోసం ముందు జాగ్రత్తగా విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ కు సెకండ్ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. ఈ వినూత్నమైన ఆలోచన కారణంగా గెలవాల్సిన మ్యాచ్ చేయి జారిపోయిందని మాజీ బ్యాటర్ సబా కరీమ్ భారత్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ పై మండిపడ్డారు.
ఈ క్రమంలో మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన ఓ వినూత్నమైన ప్రకటన ప్రస్తుత టీమిండియా కోచింగ్ విధానం పై పలు రకాల అనుమానాలను రేకెత్తిస్తోంది. ది వీక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కపిల్ ప్రస్తుతం భారత్ క్రికెట్ ప్లేయర్స్ వైఖరి గురించి తనదైన శైలిలో విమర్శించారు. ప్రస్తుతం ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పిన కపిల్.. ఆ ఆత్మవిశ్వాసం అనే కాన్సెప్ట్ కి డెఫినిషన్ ని కూడా ఇచ్చారు.
అంతా మాకే తెలుసు అనే వైఖరి కనబరుస్తూ ఎవరి సలహాలు తీసుకోకుండా ఇగోయిస్తిక్ గా కొంతమంది ప్లేయర్స్ వ్యవహరిస్తున్నారు అనేది కపిల్ అభిప్రాయం. అసలు ఇది మొదలైంది ఎక్కడి నుంచి అంటే.. క్రితం నెలలో ఐసిఐసిఐ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత్ ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ ని ఓడిపోయింది. ఆ క్రమంలో సునీల్ గవాస్కర్ అన్న మాటలను ఇప్పుడు కపిల్ మాట్లాడిన మాటలు సమర్థిస్తున్నట్లుగా ఉన్నాయి.
ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్ ,సచిన్ టెండూల్కర్ ,వీవీఎస్ లక్ష్మణ్ తన వద్దకు రెగ్యులర్ గా వచ్చి తమకు ఉన్న డౌట్స్ను అడిగి క్లియర్ చేసుకునేవారని గవాస్కర్ చెప్పారు. ఇలా తమకు తెలియని విషయాలను సీనియర్స్ ను అడిగి తెలుసుకోవడానికి అప్పట్లో ప్లేయర్స్ కి అహం అడ్డు వచ్చేది కాదు అనేది గవాస్కర్ అభిప్రాయం. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ తో మాట్లాడడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆల్రెడీ ఇద్దరు కోర్సులు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మాట్లాడే విషయాలు గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఆగాల్సి వస్తుంది.. అని గవాస్కర్ అన్న మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
తిరిగి ఇప్పుడు కపిల్ గవాస్కర్ అప్పుడు చేసిన వ్యాఖ్యల గురించే మాట్లాడడం జరిగింది. కొన్నిసార్లు మనకు ఎక్కువ డబ్బు వస్తున్నప్పుడు అహంకారం కూడా ఆటోమేటిక్గా వస్తుంది అని కపిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లకు సంపాదన జాస్తి.. దాంతో అన్ని తమకే తెలుసు అన్న భావన కూడా ఎక్కువ అయిపోయింది.. అదొక్కటే ప్రస్తుతం తేడా…నిజానికి హెల్ప్ అవసరమైన క్రికెటర్స్ ప్రస్తుతం ఎందరో ఉన్నారు కానీ అడగడానికి వాళ్లకు ఎక్కడలేని అభ్యంతరం ఎందుకు ఎదురవుతుందో ఎవరికి అర్థం కాదు అని కపిల్ చెప్పుకొచ్చారు.
50 సీజన్లకు పైగా క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న సునీల్ గవాస్కర్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మీ దగ్గర ఉన్నప్పుడు ఒకసారి సంప్రదించడంలో తప్పేముంది. తెలియని విషయం లేదు డౌట్ ఉన్న విషయం మనకంటే సీనియర్స్ ని అడిగి తెలుసుకోవడానికి అహం ఎందుకు అడ్డు వస్తుంది? అనేది కపిల్ ఆవేదన. సునీల్ గా భాస్కర్ విషయం నుంచి నేను ఒక విషయం నేర్చుకున్నాను అని చెప్పిన కపిల్ ,ఆ విషయం ఏమిటో కూడా వివరించి చెప్పారు. ఎవరికైనా స్వతహాగా సలహా కావాలి అంటూ మన దగ్గరికి వస్తే తప్ప సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కపిల్ అన్నారు.
వసతులు, వనరులు ఏవి పుష్కలంగా లేని కాలంలో…సమయంతో ,సమాజంతో పోటీ పడుతూ…ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొని ప్రపంచ కప్ సాధించాలి అన్న భారత్ చిరకాల వాంఛను నెరవేర్చిన ఒక మాజీ క్రికెట్ కెప్టెన్ ప్రస్తుతం ప్లేయర్ల వైఖరి పై చేసిన ఈ విమర్శ…ఇప్పటికైనా క్రికెట్ కోచింగ్ విధివిధానాలలో మార్పు వస్తుంది అని ఆశిద్దాం.