T20 World Cup 2026 prediction: మరి కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి టోర్నీని భారత్, శ్రీలంక క్రికెట్ యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్లేయర్ల జాబితాను వెల్లడించాయి. ఈసారి భారీగా జట్లు పాల్గొంటున్న నేపథ్యంలో పోటీ కూడా ఊహించని స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో 300 స్కోర్ గురించి ప్రతిసారి చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈసారి కూడా ఆ చర్చ మొదలైంది. ప్రస్తుతం జరగబోయే టి20 వరల్డ్ కప్ లో 300 స్కోర్ మార్కెట్ బ్రేక్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో టీ మీడియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా ఉన్నాడు. అతడి ఇటీవల మీడియాతో మాట్లాడాడు. టి20 వరల్డ్ కప్ గురించి తనదైన విశ్లేషణ చేశాడు. ” కంగారులు లేదా భారత ప్లేయర్లు ఈసారి 300కు పైగా పరుగులు కొడతారని బలంగా నమ్ముతున్నాను. ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో అత్యధిక సామర్థ్యం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. మీరు కచ్చితంగా భారీగా పరుగులు చేస్తారు. నా దృష్టిలో ఈ రెండు జట్లు సింహ భాగంలో ఉంటాయి. ఈ జట్లలో ఎవరో ఒక ఆటగాడు సెంచరీ గనుక చేస్తే కచ్చితంగా 300 పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని” రవి శాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 260 పరుగులే హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతోంది. 2007 వరల్డ్ కప్ లో కెన్యా జట్టుపై శ్రీలంక 260 పరుగులు చేసింది. ఇప్పటి వరకే ఇదే ఒక జట్టు సాధించిన అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఇక ప్రస్తుతం టీమిండియాలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే లాంటి ప్లేయర్లు ఉన్నారు. మ్యాక్స్వెల్, స్టోయి నీస్, టీమ్ డేవిడ్, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ లాంటి ప్రమాదకరమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ రెండు జట్లు తమ లీగ్ సమరంలో చిన్న చిన్న జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఆ సమయంలో అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.
ఇక ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక కేంద్రాలుగా జరుగుతుంది. వచ్చే నెల 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న మొదలవుతుంది. ప్రారంభ మ్యాచ్లో నెదర్లాండ్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20చట్లు పోటీ పడుతున్నాయి. నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా, పాకిస్తాన్, ఇండియా ఒకే గ్రూపులో ఉండడం విశేషం.