https://oktelugu.com/

Rajat Patidar: రంజీ ట్రోఫీ లో బెంగళూరు ఆటగాడి విధ్వంసం.. హర్యానా వేదికగా శతక విన్యాసం..

రంజి ట్రోఫీలో బెంగళూరు ఆటగాడు సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన దేశవాళి క్రికెట్ టోర్నీ రంజి ట్రోఫీ 2024-25 లో రజత్ పాటిదర్ అదరగొడుతున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుకు ఆడుతున్న అతడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 29, 2024 / 05:39 PM IST

    Rajat Patidar

    Follow us on

    Rajat Patidar: హర్యానా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మూడవ రౌండ్ లో ఏకంగా 68 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ సెంచరీ ద్వారా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీ హిస్టరీ లోనే అత్యంత స్పీడ్ గా సెంచరీ కొట్టిన మూడవ ప్లేయర్ గా రజత్ సంచలనం సృష్టించాడు. కేవలం అరవింద్ బంతుల్లోనే శతకం చేశాడు. మధ్యప్రదేశ్ చెట్టి తరఫున అత్యంత వేగంగా శతకం కొట్టిన ఆటగాడిగా వినతికెక్కాడు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ఆటగాడు నమన్ ఓజా ఘనతను అధిగమించా. నమన్ 2017లో కర్ణాటక జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 69 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా చూస్తే అత్యంత వేగవంతమైన సెంచరీ ఘనత రిషబ్ పంత్ పేరు మీద ఉంది. అతడు 48 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు శక్తి సింగ్ 1990లో హర్యానా జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో 45 బాల్స్ లోనే సెంచరీ చేశాడు. అయితే దీనికి సంబంధించి రికార్డులు లేవు. ఎందుకంటే నాటి మ్యాచ్ కు ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. దీంతో ఆఫెన్చరిని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. రజత్ విధ్వంసకరమైన ఆట తీరు ప్రదర్శించడంతో మధ్యప్రదేశ్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.

    ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 308 రన్స్ చేసింది. అప్పుడు రజత్ కేవలం 15 రన్స్ మాత్రమే చేశాడు. అనంతరం హర్యానా 440 రన్స్ చేసింది. 132 లీడ్ సాధించింది. భారీ వ్యత్యాసంతో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్య ప్రదేశ్ 48 ఓవర్స్ ముగిసే సమయానికి, 4 వికెట్లు నష్టపోయి 308 రన్స్ చేసింది. రజత్ 159 పరుగులు చేశాడు. 102 బంతులు ఎదుర్కొన్న అతడు 13 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు.. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టలేదు. అతడి టార్గెట్ కేవలం బౌండరీ గానే సాగింది. అందువల్లే వీరోచితంగా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. కొంతకాలంగా జాతీయ జట్టులోకి రావాలని భావిస్తున్న రజత్.. ఈ ఇన్నింగ్స్ ద్వారా జట్టులోకి వచ్చే దారులను అతడు పటిష్టం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత.. టీమిండియా ఆడే తదుపరి టెస్ట్ లకు రజత్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున రజత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు బెంగళూరు జట్టు ఫైనల్ దాకా వెళ్లలేకపోయింది. గత సీజన్లో కప్ సాధించాలని భావించినప్పటికీ.. ఆ జట్టుకు ఐపీఎల్ లో పరిస్థితులు అనుకూలంగా మారలేదు.